Telangana: బస్టాండ్‌లోని టాయ్​లెట్​లో రివాల్వర్​ మర్చిపోయిన జవాన్.. తర్వాత గుర్తొచ్చి వెళ్లి చూడగా

టాయ్​లెట్‌కు వెళ్లి గోడపై రివాల్వర్ పెట్టి మర్చిపోయాడు జవాన్. కొంతసేపటి తర్వాత తిరిగివచ్చి చూడగా అది అక్కడ కనిపించలేదు.

Telangana: బస్టాండ్‌లోని టాయ్​లెట్​లో రివాల్వర్​ మర్చిపోయిన జవాన్.. తర్వాత గుర్తొచ్చి వెళ్లి చూడగా
Revolver(representative image)
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 01, 2022 | 4:43 PM

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. సైనికుడి రివాల్వర్‌ చోరీకి గురైంది. ఇందులో ఆ జవాన్ పొరపాటు కూడా కొంత ఉంది. వివరాల్లోకి వెళ్తే.. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా సర్వీస్ చేస్తున్న అబ్దుల్ సికిందర్ అలీ సెలవులపై ఇంటికి పయనమయ్యారు. ఈ క్రమంలోనే శనివారం మార్నింగ్ జహీరాబాద్ బస్టాండ్‌లో దిగాడు.  అక్కడ వాష్‌రూమ్‌కి వెళ్లిన సమయంలో.. పక్కన గోడపై తన రివాల్వర్ పెట్టి మర్చిపోయాడు. ఆ తర్వాత తన సొంతూరు సిర్గాపూర్ వెళ్లే బస్సు రావడంతో.. తొందరలో ఆ బస్సు ఎక్కేశాడు. కొంత దూరం ప్రయాణించాక రివాల్వర్ మిస్ అయిన విషయం అతడికి గుర్తొచ్చింది. దీంతో వెంటనే మళ్లీ జహీరాబాద్ బస్టాండ్‌కు వచ్చి.. వెతక్క.. పెట్టిన ప్లేసులో రివాల్వర్ కనిపించలేదు. అక్కడి టాయ్‌లెట్ నిర్వాహకులను అడగ్గా కూడా ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. దీంతో జహీరాబాద్ సీటీ పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేశాడు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు షురూ చేశారు.  గుర్తు తెలియని వ్యక్తులు గన్‌ను చోరీ ఉండవచ్చని భావించి.. బస్టాండ్‌లో సీసీ కెమెరాల పుటేజ్ సేకరించి.. విచారణ జరుపుతున్నారు. రివాల్వర్ తీసుకొచ్చి ఇచ్చినవారికి తగిన పారితోషికం ఇస్తామని పోలీసులు తెలిపారు. అదే విధంగా వారి వివరాలను కూడా గోప్యంగా ఉంచుతామన్నారు సీఐ తోట భూపతి. అలా కాకుండా గన్ దాచి తిరిగితే మాత్రం.. పట్టుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.

పొరపాటు అనేది సహజం. జవాన్ కంగారులో రివాల్వర్ మర్చిపోయి ఉండొచ్చు. కానీ దాన్ని చూసినవారు ఆ టాయిలెట్ నిర్వాహకులకు తెలియజేయాలి. లేదా స్థానిక పోలీస్ స్టేషన్‌లో  అయినా అప్పగించాలి. కానీ సైలెంట్‌గా దాన్ని ఎత్తుకెళ్లడం మాత్రం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా న్యూస్ చూసి.. దాన్ని సరెండర్ చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలా కాకుంటే.. ఇంకా కొన్నాళ్లకుు అయినా పోలీసులు ట్రేస్ చేస్తారు. అప్పుడు చట్టపరమైన చర్యలను ఎదుర్కొవాల్సి ఉంటుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.