Sonu Sood: అలా జరగడం దురదృష్టకరం.. దయచేసి ఆ వీడియోలను షేర్ చేయకండి.. ప్రజలకు సోనూసూద్ విజ్ఞప్తి

చేసేది విలన్ వేషాలే అయినా రియల్ లైఫ్ లో మాత్రం హీరో అనిపించుకున్నారు సోనూసూద్(Sonu Sood). ముఖ్యంగా కరోనా సమయంలో సోనూసూద్ చేసిన సేవలకు దేశమంతా ప్రశంసించింది

Sonu Sood: అలా జరగడం దురదృష్టకరం.. దయచేసి ఆ వీడియోలను షేర్ చేయకండి.. ప్రజలకు సోనూసూద్ విజ్ఞప్తి
Sonu Sood
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 18, 2022 | 7:56 PM

చేసేది విలన్ వేషాలే అయినా రియల్ లైఫ్ లో మాత్రం హీరో అనిపించుకున్నారు సోనూసూద్(Sonu Sood). ముఖ్యంగా కరోనా సమయంలో సోనూసూద్ చేసిన సేవలకు దేశమంతా ప్రశంసించింది. కష్టాల్లో ఉన్న ఎంతో మందికి సోనూ అండగా నిలిచారు. అలాగే కరోనా తర్వాత కూడా కష్టం వచ్చింది అని చెప్పుకుంటే చాలు నేనున్నా అంటూ ముందుకు వచ్చి ఎంతో మందిని ఆదుకున్నారు సోనూ.. తాజాగా సోనూసూద్ ప్రజలకు ఓ విజ్ఞప్తి చేశారు. అసలేంజరిగిందంటే.. పంజాబ్ మొహాలిలోని చండీఘఢ్‌ యూనివర్సిటీలో విద్యార్ధినుల ఎంఎంఎస్ వీడియోల లీక్‌పై రగడ రాజుకుంది. యూనివర్సిటీ అధికారుల తీరును నిరసిస్తూ విద్యార్ధులు శనివారం రాత్రి నుంచి భారీ ఆందోళన చేపట్టారు. 60 మంది యువతుల ప్రైవేటు వీడియోలను వారితో కలిసి ఉండే మరో యువతి తీయడం సంచలనంగా మారింది. అంతే కాకుండా ఆ వీడియోలు ఆ యువతి స‍్నేహితుల ద్వారా సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి.

60 మంది విద్యార్ధినుల స్నానాల దృశ్యాలను వైరల్‌ చేసిన వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ క్యాంపస్‌లో యువతులు బైఠాయించారు. పరిస్థితి అదుపు తప్పడంతో రెండు రెండు పాటు యూనివర్సిటీకి సెలవులు ప్రకటించారు. శనివారం రాత్రి నుంచి ఈ ఘటనపై యూనివర్సిటీ అట్టుడుకుతోంది. దీనిపై సోనూసూద్ స్పందిస్తూ.. చండీగఢ్‌ యూనివర్సీటీలో ఇలాంటి ఘటన జరగడం దురదృష‍్టకరమన్నారు. దయచేసి ఎవరూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇలాంటి క‍్లిష్ట సమయంలో మనం వారికి పూర్తి అండగా నిలవాలని ట్విట్టర్‌ ద్వారా సోనూ సూద్ కోరారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..