Telugu News Sports News Cricket news RSWS 2022: Father jailed for cheating, was upset, now hitting 266 runs by hitting 10 sixes, 30 fours Telugu Cricket News
తండ్రి జైలు పాలు.. తీవ్ర మనస్తాపం.. కట్ చేస్తే ..10 సిక్స్‌లు, 30 ఫోర్లు.. 266 రన్స్‌తో వీరవిహారం
శనివారం (అక్టోబర్ 1) రాత్రి జరిగిన రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ ఫైనల్ మ్యాచ్‌లో సెంచరీతో మెరిశాడు నమన్. శ్రీలంక లెజెండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 71 బంతుల్లో 108 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో ఏకంగా 15 ఫోర్లు, 2 సిక్సర్లు ఉండడం విశేషం.
రోజులో పగలు, రాత్రి ఉన్నట్లే అందరి జీవితాల్లోనూ ఎత్తు పల్లాలు ఉంటాయి. చీకటి వెంటే వెలుగు ఉన్నట్లు అప్పుడప్పుడు కష్టాలు కూడా తారసపడుతుంటాయి. అన్నింటినీ తట్టుకుని నిలబడి ధైర్యంగా ముందుకు సాగితేనే జీవితం. టీమిండియా వెటరన్ ప్లేయర్ నమన్ ఓజా లైఫ్ కూడా అలాంటిదే. శనివారం (అక్టోబర్ 1) రాత్రి జరిగిన రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ ఫైనల్ మ్యాచ్‌లో సెంచరీతో మెరిశాడు నమన్. శ్రీలంక లెజెండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 71 బంతుల్లో 108 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో ఏకంగా 15 ఫోర్లు, 2 సిక్సర్లు ఉండడం విశేషం. ఈ ఇన్నింగ్స్ తోనే చలవతోనే సచిన్ సారథ్యంలోని ఇండియా లెజెండ్స్ వరుసగా రెండోసారి రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌ను కైవసం చేసుకుంది. కాగా అంతకుముందు ఆస్ట్రేలియా లెజెండ్స్ తో జరిగిన సెమీఫైనల్‌లో మ్యాచ్‌లోనూ అతను హాఫ్ సెంచరీ సాధించాడు. కాగా ఈ సిరీస్‌లో మొత్తం 137 కంటే ఎక్కువ స్ట్రైక్‌రేట్‌తో 266 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు ఓజా. టోర్నీ మొత్తం మీద 10 సిక్సర్లు, 30 ఫోర్లు బాదాడు.
What an Extraordinary Batting Technique!
Naman Ojha Hit the Fantabulous Century in The Finals of RSWS season 2, putting up an unbeaten score of 108 runs from 71 balls
It is an Adrenaline rush moment for all of us! #namanojhapic.twitter.com/gyzbAdyPu6
కాగా మూడు నెలల క్రితం నమన్ ఓజా తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొన్నాడు. అక్రమాస్తుల ఆరోపణలు వెల్లువెత్తడంతో నమన్ తండ్రి వినయ్ ఓజాపై చీటింగ్, ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. అరెస్టు కూడా చేశారు. దీంతో ఓజా తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. అయితే మూడు నెలల గ్యాప్‌లోనే మైదానంలోకి దిగి అద్భుత ప్రదర్శన చేశాడు. రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ లో ఇండియా లెజెండ్స్ తరఫున బరిలోకి దిగి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఫైనల్ మ్యాచ్లో సెంచరీ సాధించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
Congratulations Team India Legends!
We won the Championship again !
What an overwhelming moment! pic.twitter.com/XE1srvXU1e
నమన్ ఓజా కెరీర్ విషయానికొస్తే..2010లో శ్రీలంకపై ఏకైక వన్డే ఆడిన అతను అదే ఏడాది జింబాంబ్వేపై అంతర్జాతీయ టీ20ల్లోకి అరంగేట్రం చేశాడు. 2015 శ్రీలంకతో ఏకైక టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ఇక ఐపీఎల్‌లో సనరైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఇలా భారత్ తరఫున ఏకైక వన్డే, టెస్ట్, రెండు టీ20లు ఆడిన ఈ మధ్య ప్రదేశ్ ప్లేయర్ గతేడాది ఫిబ్రవరిలో క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.