Optical Illusion: కోడి పిల్లల మాటున 5 నిమ్మకాయలు.. 10 సెకన్లలో కనిపెడితే మీవి డేగ కళ్లే.. ట్రై చేయండి మరి
ఇందులో కోడి పిల్లల గుంపులో 5 నిమ్మకాయలు దాగి ఉన్నాయి. వాటిని 10 సెకన్లలో కనిపెడితే మీ కళ్లల్లో మెరుపు ఉన్నట్లే. ప్రముఖ హంగేరియన్ కళాకారుడు చిత్రకారుడు గెర్గెలీ డుడాస్ ఈ ఫొటో పజిల్‌ను రూపొందించాడు.
ఆప్టికల్ ఇల్యూషన్ అనేది మన కళ్లను మోసగిస్తుంది. అదే సమయంలో పరిశీలనా నైపుణ్యాలను పరీక్షిస్తుంది. మెదడుకు పదును పెట్టడంతో పాటు ఏకాగ్రత సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈనేపథ్యంలో మీకోసం మరొక సరికొత్త ఆప్టికల్ ఇల్యూషన్ టెస్ట్‌ను తీసుకొచ్చాం. ఇందులో కోడి పిల్లల సమూహంలో 5 నిమ్మకాయలు దాగి ఉన్నాయి. వాటిని 10 సెకన్లలో కనిపెడితే మీ కళ్లల్లో మెరుపు ఉన్నట్లే. ప్రముఖ హంగేరియన్ కళాకారుడు చిత్రకారుడు గెర్గెలీ డుడాస్ ఈ ఫొటో పజిల్‌ను రూపొందించాడు. ఆయన ఇలాంటి ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలను రూపొందించడంలో ఎంతో దిట్ట. ఆయన వేసిన స్కెచ్‌లు, చిత్రాలు, ఫొటో పజిల్స్ నెటిజన్లను బాగా ఆకట్టుకున్నాయి.
అలా ఈసారి కూడా మరో విచిత్రమైన ఫొటో పజిల్‌ను మన ముందుకు తీసుకొచ్చాడు డుడాస్. ఇందులో కొన్ని కోడిపిల్లలు ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటున్నాయి. మరికొన్ని స్టైలిష్‌గా గాగుల్స్ ధరించి పోజులిస్తున్నాయి. ఇంకొన్ని మఫ్లర్లతో ముస్తాబయ్యాయి. ఆశ్చర్యకరంగా ఈ కోడిపిల్లల మాటునే 5 నిమ్మకాయలు దాచి ఉంచాడు హంగేరీ డిజైనర్. నిజానికి, నిమ్మకాయలు దాదాపు ఒకేలా ఉండటం వల్ల వాటిని కనుగొనడం అంత తేలికైన పని కాదు. అయితే కాస్త ఓపిక తెచ్చుకుని చూస్తే మాత్రం కనిపెట్టడం అంతకష్టమేమీ కాదు. మరి మీరు మేధావి అని నిరూపించుకోవాలనుకుంటే పై నుండి క్రిందికి, కుడి నుండి ఎడమకు తీక్షణంగా ఫొటోను చూడండి. సమాధానం దొరకుతుంది. దీని తర్వాత కూడా ఆన్సర్ దొరక్కపోతే మాత్రం కింది ఫొటోను చూడండి.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..