Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PV Sindhu: ఓ మై గాడ్‌.. ఇంట్లో అసలు ఖాళీ లేదుగా.. హైదరాబాదీ షట్లర్‌ ట్రోఫీలు, మెడల్స్‌ చూసి అవాక్కైన బాలీవుడ్‌ నటుడు

అనుపమ్‌ ఖేర్‌ షేర్‌ చేసిన వీడియోలో సింధు ఇంట్లో ఉన్న ట్రోఫీలు, మెడల్స్‌ అన్నింటినీ మనం చూడవచ్చు. అండర్‌-13 టోర్నమెంట్ల నుంచి ఒలింపిక్స్‌ దాకా సింధు సాధించిన విజయాలను ఇవి గుర్తుచేస్తున్నాయి.

PV Sindhu: ఓ మై గాడ్‌.. ఇంట్లో అసలు ఖాళీ లేదుగా.. హైదరాబాదీ షట్లర్‌ ట్రోఫీలు, మెడల్స్‌ చూసి అవాక్కైన బాలీవుడ్‌ నటుడు
Sindhu,anupam Kher
Follow us
Basha Shek

|

Updated on: Sep 30, 2022 | 1:18 PM

ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధును కలిశారు. హైదరాబాలో ఉన్న సింధు నివాసానికి వెళ్లిన అనుపమ్‌ అక్కడు ఆమె సాధించిన పతకాలు, ట్రోఫీలు, ప్రశంసా పత్రాలను ఆశ్చర్యపోయారు. అనంతరం దీనికి సంబంధించిన విశేషాలను ట్విట్టర్‌లో పంచుకున్నారు. సింధు కూడా అనుపమ్‌తో కలిసున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ప్రస్తుతం సింధు, అనుపమ్‌లకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా అనుపమ్‌ ఖేర్‌ షేర్‌ చేసిన వీడియోలో సింధు ఇంట్లో ఉన్న ట్రోఫీలు, మెడల్స్‌ అన్నింటినీ మనం చూడవచ్చు. అండర్‌-13 టోర్నమెంట్ల నుంచి ఒలింపిక్స్‌ దాకా సింధు సాధించిన విజయాలను ఇవి గుర్తుచేస్తున్నాయి. ఈ సందర్భంగా హైదరాబాదీ షట్లర్‌పై ప్రశంసలు కురిపించాడు అనుపమ్‌.

ఛాంపియన్‌ను కలిశాను..

ఇవి కూడా చదవండి

నిజంగా ఇది అద్భుతం. ఇటీవల నాకు బ్యాడ్మింటన్‌ ఛాంపియన్ పీవీ సింధు ఇంటికి వెళ్లే అవకాశం లభించింది. 8 ఏళ్ల వయస్సు నుంచి ఆమె సాధించిన విజయాలు, అవార్డులు ట్రోఫీల గురించి ఆమెను అడిగి తెలుసుకున్నాను. సింధు వినయానికి నేను పూర్తిగా బౌల్డ్‌ అయ్యాను. ఆమె మనకు స్ఫూర్తి కలిగించే నిజమైన హీరో’ అని చెప్పుకొచ్చిన ఈ దిగ్గజ నటుడు.. మరో సందర్భంలో సింధు సాధించిన ట్రోఫీలను చూపిస్తూ ‘ఆమె వన్ అండ్ ఓన్లీ ఛాంపియన్. ఈ గోడను చూడండి. నా గోడపై ఉన్న అవార్డ్స్ చూసి నేను గర్వపడేవాడిని. కానీ ఇక్కడ చూడండి. ఇది చాలా అద్భుతమైనది. ఓ మై గాడ్.. ఇక్కడ అసలు ఖాళీ లేదు’ అని తెలిపారు.

ఇది నా అదృష్టం..

ఇక సింధూ సైతం ఇన్‌స్టాగ్రామ్‌లో అనుపమ్ తో సమావేశానికి సంబంధించిన ఫోటోని షేర్‌ చేసింది. ‘ భారతీయ సినిమా ఆల్ టైమ్ గ్రేట్ యాక్టర్స్ లో ఒకరైన అనుపమ్‌ ఖేర్‌ను కలిసే అదృష్టం కలిగింది’ అని తన ఆనందానికి అక్షరరూపమిచ్చింది. కాగా నిఖిల్‌ నటించిన సూపర్‌హిట్‌ సినిమా కార్తికేయ2లో ఒక కీలక పాత్ర పోషించారు అనుపమ్‌. అదేవిధంగా మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కుతున్న ‘టైగర్ నాగేశ్వరరావు’ లోనూ ఓ మెయిన్‌ రోల్‌లో కనిపించనున్నారు. తాజాగా అనుపమ్ పాత్రకు సంబంధించిన షూటింగ్ పార్ట్ కూడా పూర్తి చేసినట్లు చిత్ర బృందం తెలిపింది.

మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..

వనజీవి రామయ్య మృతికి ప్రధాని మోదీ సంతాపం!
వనజీవి రామయ్య మృతికి ప్రధాని మోదీ సంతాపం!
హ్యాండ్ షవర్ వల్ల నీళ్లు లీక్ అవుతున్నాయా? ఈ టిప్స్‌తో సమస్య ఫసక్
హ్యాండ్ షవర్ వల్ల నీళ్లు లీక్ అవుతున్నాయా? ఈ టిప్స్‌తో సమస్య ఫసక్
ప్రయాణాలంటే చాలు ఇంట్లో క్షణం ఉండరు ప్రపంచాన్ని చుట్టేయాలనుకుంటార
ప్రయాణాలంటే చాలు ఇంట్లో క్షణం ఉండరు ప్రపంచాన్ని చుట్టేయాలనుకుంటార
ట్రెడిషనల్ డ్రెస్ లో ముద్దు ముద్దుగా మెస్మరైజ్ చేస్తున్న బ్రిగిడ
ట్రెడిషనల్ డ్రెస్ లో ముద్దు ముద్దుగా మెస్మరైజ్ చేస్తున్న బ్రిగిడ
హిల్ స్టేషన్ పై.. హీట్ పుట్టిస్తున్న అనన్య స్టన్నింగ్ లుక్స్
హిల్ స్టేషన్ పై.. హీట్ పుట్టిస్తున్న అనన్య స్టన్నింగ్ లుక్స్
హ్యాపీ హ్యాపీ‎గా.. సంతోషంగా చిందులేస్తున్న శ్రీలీల
హ్యాపీ హ్యాపీ‎గా.. సంతోషంగా చిందులేస్తున్న శ్రీలీల
అల్లు అర్జున్‌కు చెల్లిగా.. సిద్దూజొన్నలగడ్డకు లవర్‌గా
అల్లు అర్జున్‌కు చెల్లిగా.. సిద్దూజొన్నలగడ్డకు లవర్‌గా
మరో మూడు రోజులు వర్షాలే.. ఏపీ వెదర్ రిపోర్ట్ ఇదే..
మరో మూడు రోజులు వర్షాలే.. ఏపీ వెదర్ రిపోర్ట్ ఇదే..
సిలిండర్ ధరలు పెంచారని వినూత్న నిరసన..కర్నూల్లో ఏం చేశారో చూడండి?
సిలిండర్ ధరలు పెంచారని వినూత్న నిరసన..కర్నూల్లో ఏం చేశారో చూడండి?
ఈ జ్యూస్ అమృతంతో సమానం..ప్రతిరోజూతీసుకుంటే బాడీలో మిరాకిల్స్ ఖాయం
ఈ జ్యూస్ అమృతంతో సమానం..ప్రతిరోజూతీసుకుంటే బాడీలో మిరాకిల్స్ ఖాయం