బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తపా.. వెరైటీ కోసం వధువు చేసిన పనికి నెటిజన్లు ఫిదా..
ప్రెసెంట్ అంతా బుల్లెట్ బండి ట్రెండ్ నడుస్తోంది.. ప్రతి ఒక్కరూ బుల్లెట్ ఎక్కి డుగ్గు డుగ్గు మంటూ దూసుకెళ్తున్నారు. ఫొటోలు, వీడియోలు తీయించుకుని మురిసిపోతున్నారు. మరోవైపు.. పెళ్లి అనేది జీవితంలో ఒకసారి మాత్రమే...
ప్రెసెంట్ అంతా బుల్లెట్ బండి ట్రెండ్ నడుస్తోంది.. ప్రతి ఒక్కరూ బుల్లెట్ ఎక్కి డుగ్గు డుగ్గు మంటూ దూసుకెళ్తున్నారు. ఫొటోలు, వీడియోలు తీయించుకుని మురిసిపోతున్నారు. మరోవైపు.. పెళ్లి అనేది జీవితంలో ఒకసారి మాత్రమే చేసుకునే అందమైన వేడుక. ప్రతి ఒక్కరూ తన వివహం రొటీన్ గా కాకుండా ప్రత్యేకంగా ఉండిపోవాలనుకుంటారు. అందుకు ఎవరూ చేయని విధమైన పనులు చేస్తూ హాట్ టాపిక్ గా మారుతుంటారు. వారు చేసే చిన్న చిన్న పనులే వివాహ వేడులో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచిపోతాయి. శుభలేఖలు, పెళ్లి పందిరి, బరాత్ ఇలా అన్ని కార్యక్రమాల్లో వెరైటీని కోరుకుంటారు. ఇందులో ముఖ్యంగా బరాత్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. పెళ్లి కుమారుడు లేదా పెళ్లి కుమార్తెను మండపానికి తీసుకువచ్చేందుకు కుటుంబసభ్యులందరూ చేసే అపురూపమైన వేడుక. మేళతాళాలు, డోలు చప్పుళ్ల మధ్య జరిగే ఆ సందడే వేరు. డ్యాన్స్ చేస్తూ, కేరింతలు కొడుతూ చేసే హంగామా మామూలుగా ఉండదు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో చాలానే ఉన్నాయి. ఇప్పుడు కూడా అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ క్లిప్ ను చూసేందుకు నెటిజన్లు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.
ఇవి కూడా చదవండిView this post on Instagram
వైరల్ అవుతున్న ఈ క్లిప్ లో పెళ్లి కూతురు మండపానికి చేరుకునేందుకు వినూత్న ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం కుర్రకారును ఊపేస్తున్న బుల్లెట్టు బండిపై డుగ్గు డుగ్గు మని దూసుకెళ్లింది. వివాహ వేదికకు చేరుకోగానే వరుడి మెడలో వరమాల వేస్తుంది. కాగా.. ఈ వీడియో ఇంటర్నెట్ లో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ అయింది. షేర్ అయిన వెంటనే వైరల్ గా మారింది. అంతే కాకుండా వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.