AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరీ ఇలా తయారయ్యరేంట్రా.. గోల్‌గప్పాలతో వెరైటీ వంటకం.. దెబ్బకు పానిపూరి ప్రేమికుల ఫ్యూజులౌట్‌

మరో సరికొత్త వంటకం సోషల్‌ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. అదే గోల్‌గప్పా షేక్‌ (పానిపూరి షేక్‌). ఈ వెరైటీ వంటకాన్ని చూసి పానీపూరీ ప్రియులు తలబాదుకుంటున్నారు.

మరీ ఇలా తయారయ్యరేంట్రా.. గోల్‌గప్పాలతో వెరైటీ వంటకం.. దెబ్బకు పానిపూరి ప్రేమికుల ఫ్యూజులౌట్‌
Golgappa Shake
Basha Shek
|

Updated on: Oct 01, 2022 | 10:32 AM

Share

ఈ రోజుల్లో కొందరు ఆహారం విషయంలో పలు ప్రయోగాలు చేస్తున్నారు. వెరైటీ కాంబినేషన్లలో రెసిపీలు తయారుచేస్తూ ఫుడ్‌ లవర్స్‌కు తీవ్ర ఆగ్రహం చేస్తున్నారు. మ్యాగీ, సమోసాలు, గులాబ్‌జామున్‌, పానిపూరి.. ఇలా వెరైటీ కాంబినేషన్లలో వింత వింత వంటకాలు ట్రై చేస్తున్నారు. ఈ రెసిపీలను చూస్తుంటే వాటిని తినాలన్న కోరిక కూడా చచ్చిపోతోంది. ఈనేపథ్యంలో మరో సరికొత్త వంటకం సోషల్‌ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. అదే గోల్‌గప్పా షేక్‌ (పానిపూరి షేక్‌). ఈ వెరైటీ వంటకాన్ని చూసి పానీపూరీ ప్రియులు తలబాదుకుంటున్నారు. ఈ విచిత్ర షేక్ చూసి వాంతులు అవుతున్నాయంటూ నెటిజన్లు నెట్టింట దుమ్మెత్తి పోస్తున్నారు.

చూస్తుంటేనే వాంతి వస్తోంది..

వైరల్‌ అవుతోన్న ఈ వీడియోలో మొదట మిక్సర్‌లో రెండు పానిపూరీలను వేస్తాడు. తరువాత కొన్ని ఉడికించిన బంగాళాదుంపలు, రెడ్ చట్నీ, చింతపండు రసం కలుపుతాడు. ఆ తరువాత కొద్దిగా ఐస్ జోడించి.. మిక్సర్ ఆన్ చేస్తాడు. బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక గ్లాసులో పోసి.. గొల్గప్ప పొడిని వేస్తాడు. ఆ తర్వాత ఉడికించిన బంగాళాదుంపలతో గార్నిష్‌ చేసి కస్టమర్లకు అందిస్తాడు.

ఇవి కూడా చదవండి

zufiscooking అనే ఇన్‌స్టాగ్రామ్‌ పేజీ ఖాతాలో షేర్‌ చేసిన ఈ వీడియోను చూసి నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పానిపూరి ప్రేమికుల కోపం నషాళానికి అంటుతోంది. ‘పానిపూరి తినాలన్న కోరికను చంపేస్తున్నారు కదరా’, ‘చూస్తుంటేనే వాంతి వస్తోంది’, ‘ప్రయోగాలతో మా బుర్ర పాడు చేయకండిరా’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇవి కాకుండా, కొంతమంది సోషల్‌ మీడియా యూజర్లు అలాంటి వ్యాపార విక్రేతలను నిషేధించాలని డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
దేశ వృద్ధి రేటు 7.8 శాతం.. ప్రజల సంకల్పంతోనే సాధ్యమైంది: ప్రధాని
దేశ వృద్ధి రేటు 7.8 శాతం.. ప్రజల సంకల్పంతోనే సాధ్యమైంది: ప్రధాని
సకల రోగాలకు ఒకటే బ్రహ్మాస్త్రం.. బంగారం కంటే విలువైనది
సకల రోగాలకు ఒకటే బ్రహ్మాస్త్రం.. బంగారం కంటే విలువైనది
సింగర్ ప్రభ గురించి ఈ విషయాలు మీకు తెలుసా.?
సింగర్ ప్రభ గురించి ఈ విషయాలు మీకు తెలుసా.?
భారీ విస్తీర్ణంలో 219 హిమానీనదాలు.. శాస్త్రవేత్తల హెచ్చరిక
భారీ విస్తీర్ణంలో 219 హిమానీనదాలు.. శాస్త్రవేత్తల హెచ్చరిక
ఉదయాన్నే ఓ కప్పు తినండి.. శరీరాన్ని లోపలి నుంచి రిపేర్ చేస్తుంది
ఉదయాన్నే ఓ కప్పు తినండి.. శరీరాన్ని లోపలి నుంచి రిపేర్ చేస్తుంది
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..