AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓరి దీని వేషాలో.. ఈ పాము స్టార్‌ హీరోలకు మించి యాక్టింగ్ చేస్తోందిగా.. ఆస్కార్‌ ఇవ్వాల్సిందే

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫన్నీ వీడియోలో, పాము చనిపోయినట్లు నటిస్తుంది. ఎంతలా అంటే సోషల్‌ మీడియా యూజర్లు కూడా దాని తెలివిని చూసి ఆశ్చర్యపోతున్నారు.

ఓరి దీని వేషాలో.. ఈ పాము స్టార్‌ హీరోలకు మించి  యాక్టింగ్ చేస్తోందిగా.. ఆస్కార్‌ ఇవ్వాల్సిందే
Snake
Basha Shek
|

Updated on: Sep 30, 2022 | 12:11 PM

Share

సాధారణంగా సినీ నటులు తెరపై అద్భుతంగా నటించడాన్ని మనం చూసి ఉంటాం. కానీ నిజ జీవితంలో ఏదైనా జంతువు నటించడం చూశారా ? అయితే కొన్ని మూగజీవాలు కూడా మనుషుల్లా నటిస్తాయి. ముఖ్యంగా ప్రాణాపాయ పరిస్థితుల్లో తమను తాము రక్షించుకోవడానికి ఏదైనా చేస్తాయి. ఇందులో భాగంగా కొన్ని జంతువులు చనిపోయినట్లు నటిస్తాయి. ఈ పాము కూడా ఇదే కోవకు చెందుతుందేమో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫన్నీ వీడియోలో, పాము చనిపోయినట్లు నటిస్తుంది. ఎంతలా అంటే సోషల్‌ మీడియా యూజర్లు కూడా దాని తెలివిని చూసి ఆశ్చర్యపోతున్నారు. నెట్టింట్లో బాగా చక్కర్లు కొడుతోన్న ఈ వీడియోలో ఒక పాము పాకడం మనం చూడవచ్చు. ఇంతలో ఒక వ్యక్తి అక్కడికి వస్తాడు. అతనిని చూసిన వెంటనే పాము కంగారుపడుతుంది. ఆ తర్వాత పరిగెత్తడం ప్రారంభిస్తుంది.

ఇవి కూడా చదవండి

కాగా ఆ వ్యక్తి పామును తన చేతివేళ్లను గన్‌లా పేర్చి పామును కాల్చిచంపుతున్నట్లు నటిస్తాడు. ఇదే సమయంలో పాము తన తెలివిని ప్రదర్శిస్తుంది. తానేం తక్కువ తిన్నానా అంటూ అతని కంటే రెండడుగులు ముందుకు వెళ్లి చనిపోతున్నట్లు నటిస్తుంది. నాలికను బయటకు పెట్టి మరీ విచిత్రంగా ప్రవర్తిస్తుంది. బహుశా ఇలా చనిపోయినట్లు నటిస్తే.. ఇక తన జోలికి రారని ఆ పాము భావించిందేమో. అందుకే ఇలా నటించిందేమో.ఈ వీడియోను ఘంటా అనే ఖాతా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియోకు లక్షలాది వ్యూస్‌, వేలల్లో కామెంట్లు, లైక్‌లు వస్తున్నాయి.

బెస్ట్ యాక్టర్ అవార్డు ఇవ్వాల్సిందే..

కాగా దీనిని చూసిన నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. ఫన్నీ , సరదా కామెంట్లు పెడుతున్నారు. ‘ఈ సంవత్సరంలో బెస్ట్ యాక్టర్ అవార్డు దీనికే ఇవ్వొచ్చు’, ‘ఆస్కార్‌ లెవెల్లో యాక్టింగ్ చేస్తోందిగా’ అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇది నకిలీ తుపాకీకే ఇంతలా భయపడుతోందంటే అది కచ్చితంగా చైనీస్ పాము అయి ఉండాలి’ అంటూ మరొకరు సరదాగా స్పందించారు.

View this post on Instagram

A post shared by Meemlogy (@meemlogy)

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్