AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Funny Video: ఏం తెలివిరా బాబు.. ఈ వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు.. పాపం అమ్మాయి..

ఎంత తెలివైన వాళ్లైనా ఒక్కోసారి పప్పులో కాలేస్తారు. అంతే కాదందోయ్ కంగారులో కూడా ఒక్కోసారి ఏం చేయాలో తెలియక చేసే పనులు నవ్వులపాలు చేస్తాయి. నవ్వుల పాలు చేయడం పక్కన పెడితే అలాంటి ఘటనలు నవ్వులు..

Funny Video: ఏం తెలివిరా బాబు.. ఈ వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు.. పాపం అమ్మాయి..
Women Drive Scooty (File Photo)
Amarnadh Daneti
|

Updated on: Sep 30, 2022 | 12:28 PM

Share

ఎంత తెలివైన వాళ్లైనా ఒక్కోసారి పప్పులో కాలేస్తారు. అంతే కాదందోయ్ కంగారులో కూడా ఒక్కోసారి ఏం చేయాలో తెలియక చేసే పనులు నవ్వులపాలు చేస్తాయి. నవ్వుల పాలు చేయడం పక్కన పెడితే అలాంటి ఘటనలు నవ్వులు కూడా పూయిస్తాయి. సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత ఎక్కడ ఎలాంటి ఫన్నీ సంఘటనలు జరిగినా వెంటనే నెట్టింట్లో ప్రత్యక్షం అయిపోతున్నాయి. తమకు తెలియకుండానే ఇలాంటి ఘటనలు వైరల్ అవుతున్నాయి. ఇంటర్నెట్ వినియోగం పెరగడానికి తోడు సోషల్ మీడియాలో ఎక్కువ మంది యాక్టివ్ ఉండటంతో ఏ మూలన జరిగిన సంఘటన అయినా ఇప్పుడు వైరల్ అయిపోతున్నాయి. వాటిని ప్రత్యేకించి వీడియో తీయకపోయినా, సీసీ కెమెరాల వినియోగం విస్తృతం కావడంతో ఫన్నీ ఇన్సిడెంట్స్ అన్ని సీసీ కెమెరాల్లో బంధీ అయిపోతున్నాయి. ఆ తర్వాత అవి సామాజిక మాద్యమాల్లో చక్కర్లు కొడుతూ వైరల్ గా మారుతున్నాయి. ఇలా ప్రతి రోజు కొన్ని వందల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇలాంటి కోవకు చెందిన ఓ ఫన్నీ వీడియో ఇప్పుడు ట్రెండింగ్ అవుతోంది. పార్కింగ్ లో ఓ యువతి కష్టాలు ఇప్పుడు నెట్టింట్లో నవ్వులు పూయిస్తున్నాయి. కొంతమంది అయితే ఏం తెలివిరా బాబు అంటూ వ్యంగంగానూ స్పందిస్తున్నారు. మరికొంత మంది ఆ అమ్మాయి కష్టం చూసి అయ్యో పాపం అంటూ జాలి పడుతున్నారు. అసలు విషయం తెలిస్తే మీరు కూడా నవ్వు ఆపులకోలేరనుకోండి.

పార్కింగ్ చేసిన స్కూటీని బయటకు తీయడం కోసం ఓ అమ్మాయి పడ్డ పాట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. వీడియో చూస్తే ఈజీగానే స్కూటర్ ను బయటకు తీయవచ్చు అనిపించేలా ఉంది. అయితే ఈ అమ్మాయి మాత్రం ఆ స్కూటీని బయటకు తీయడం కోసం శ్రమించిన తీరు నెట్టింట్లో నవ్వులు పూయిస్తుంది. టెన్షన్ లో ఆ అమ్మాయి అలా చేసిందో లేక కావాలని చేసిందో తెలీదు కాని.. ఇప్పుడు ఈ అమ్మాయి వీడియో మాత్రం వైరల్ అవుతోంది. ఓ యువతి పార్కింగ్ స్థలంలో ఉన్న తన స్కూటీని బయటకు తీసే క్రమంలో చేసిన విన్యాసాలు నెటిజన్స్ ను బీభత్సంగా ఆకట్టుకుంటుంది.

ఇవి కూడా చదవండి

పార్కింగ్ స్థలం నుంచి తన వాహనాన్ని బయటకు తీస్తున్నప్పుడు పక్కన వాహనాలను పదే పదే పక్కకు జరుపుతూ ఉంటుంది. ఇలా ఆ అమ్మాయి జరుపుతూ తన వాహనాన్ని బయటకు తీయడం కోసం శ్రమించిన విధానం నవ్వులు పూయిస్తుంది. చివరికి అష్టకష్టాలు పడుతూ తన స్కూటీని బటయకు తీసిన తీరు నెటిజన్లను కడుపుబ్బా నవ్విస్తోంది. ఒక అమ్మాయి తన స్కూటర్ ను పార్కింగ్ లో పార్క్ చేసి ఏదో పనిపై వెళ్తుంది. పని పూర్తి చేసుకుని వచ్చి తన వాహనాన్ని తీసుకుందాం అనేలోపు తన స్కూటర్ పక్కన చాలా వాహనాలు పార్క్ చేసి ఉన్నాయి. వీటి మధ్యలో నుంచి తన వాహనాన్ని బయటకు తీసే క్రమంలో చాలా విన్యాసాలు చేసింది ఆ యువతి. పక్కనున్న వాహనాలను పక్కకు జరిపి, తన స్కూటర్ ను బయటకు తీస్తున్న సమయంలో మళ్లీ తన స్కూటర్ అందులో ఇరుక్కోవడంతో తిరిగి అవే స్కూటర్లను పదే పదే పక్కకు జరుపుతూ ఉంటుంది. వీడియో చూస్తే మాత్రం తన వాహనాన్ని బయటకు తీసేందుకు ఖాళీ ఉన్నట్లే కనిపిస్తోంది. కొంత తెలివి ఉపయోగిస్తే ఆ వాహనాన్ని ఈజీగా బయటకు తీయవచ్చు. కాని తన స్కూటీనిని పార్కింగ్ ప్లేస్ నుంచి బయటకు తీయడానికి ఎన్నో కష్టాలు పడింది. ఇలా తన వాహనాన్ని బయటకు తేవడం కోసం యువతి చేసిన విన్యాసాలు మాత్రం నెటిజన్లను నవ్విస్తున్నాయి. ఈ వీడియోను ఇప్పటివరకు లక్షలాది మంది వీక్షించగా.. నెటిజన్లు తమదైన స్టైల్ లో రియాక్ట్ అవుతున్నారు.

View this post on Instagram

A post shared by SAKHT LOGG ? (@sakhtlogg)

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం చూడండి..