AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బంగారం.. ప్లీజ్ నన్ను అలా పిలవకండి.. ఉబర్ క్యాబ్‌లలో వింత బోర్డ్.. నెటిజన్ల రియాక్షన్ ఇదే..

సాధారణంగా మనం ఆటో లేదా క్యాబ్‌లలో ప్రయాణిస్తే దిగిన వెంటనే డ్రైవర్లకు థ్యాంకూ భయ్యా అని కృతజ్ఞతలు తెలుపుతాం.. ఎక్కువ వయస్సు ఉన్న డ్రైవర్లయితే థ్యాంకూ అంకుల్ అంటూ సంబోధిస్తారు. సరే.. ఇవన్నీ ఇచ్చిపుచ్చుకునే మర్యాద.. గౌరవానికి సూచిక..

బంగారం.. ప్లీజ్ నన్ను అలా పిలవకండి.. ఉబర్ క్యాబ్‌లలో వింత బోర్డ్.. నెటిజన్ల రియాక్షన్ ఇదే..
Uber Cab
Shaik Madar Saheb
|

Updated on: Sep 30, 2022 | 12:17 PM

Share

సాధారణంగా మనం ఆటో లేదా క్యాబ్‌లలో ప్రయాణిస్తే దిగిన వెంటనే డ్రైవర్లకు థ్యాంకూ భయ్యా అని కృతజ్ఞతలు తెలుపుతాం.. ఎక్కువ వయస్సు ఉన్న డ్రైవర్లయితే థ్యాంకూ అంకుల్ అంటూ సంబోధిస్తారు. సరే.. ఇవన్నీ ఇచ్చిపుచ్చుకునే మర్యాద.. గౌరవానికి సూచిక.. కానీ Uber డ్రైవర్ సీటుపై అతికించిన ఓ ఆసక్తిర సందేశం ప్రస్తుతం నెట్టింట చక్కెర్లు కొడుతోంది. దీనిని చూసి ఇలాంటి వింత అభ్యర్థన ఎప్పుడూ ఎదురుకాలేదంటూ నెటిజన్లు పేర్కొంటున్నారు. సాధారణం మనం క్యాబ్‌లో ప్రయాణిస్తే.. డ్రైవర్‌ను భయ్యా, అంకుల్, చాచా, డ్రైవర్ సాబ్.. అంటూ మర్యాదగా పిలుస్తాం.. కానీ ఓ డ్రైవర్ భయ్యా, అంకుల్ అని పిలవద్దు అంటూ సీట్లకు ఓ పేపర్ అంటించాడు. ఇది వింతగా అనిపిస్తుంది కదూ.. ఈ ఘటన ఆర్థిక రాజధాని ముంబయిలో జరిగింది. ఓ క్యాబ్ లో ప్రయాణించిన ఓ వ్యక్తి.. తనకు ఎదురైన సంఘటనను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఇంకేముంది .. ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇదంతా మంచిగానే ఉంది.. మరి డ్రైవర్‌ను ఏమని పిలవాలంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

డ్రైవర్ పక్కన ఉన్న సీటు హెడ్ రెస్ట్‌ దగ్గర అభ్యర్థన బోర్డు రాసి ఉంది.. నన్ను భయ్యా.. అంకుల్ అని పిలవకండి అని సందేశం రాసి అక్కడ అతికించాడు డ్రైవర్.. ఈ ట్విట్ పోస్ట్ చేసిన వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిని 3,000 కంటే ఎక్కువ మంది లైక్ చేసి.. రీట్విట్ చేస్తున్నారు. ఇంకా ఏమని పిలవాలంటూ ఉబెర్ ఇండియాను ట్యాగ్ చేస్తున్నారు.

అయితే.. ఈ ట్విట్ ను ఉబెర్ ఇండియా ట్యాగ్ చేయగా కంపెనీ స్పందించింది. అనుమానం ఉంటే యాప్‌లో పేరును తనిఖీ చేయండి.. అని కంపెనీ నుంచి ట్వీట్ వచ్చినట్లు సోహిని ఎం అనే మహిళ తన ట్వీట్‌లో తెలిపింది.

ఈ ట్వీట్ డ్రైవర్లను సంబోధించడానికి సరైన మార్గం ఏమిటి అనే చర్చకు కూడా దారితీసింది.

“కార్పొరేట్ వ్యక్తులు ఒకరినొకరు సర్/మేడమ్‌ అని లేదా జూనియర్ పేర్లతో సంబోధించుకుంటారు. ఈ విషయంలో ఎందుకు అలా చేయకూడదు అంటూ పేర్కొంటున్నారు. తక్కువ ప్రొఫైల్ జాబ్‌లు చేసే వ్యక్తి.. కేవలం సాధారణ వ్యక్తిగా ఎందుకు ఉండాలంటూ ఓ యూజర్ పేర్కొన్నారు. మరొకరు అందరినీ సార్/మేడమ్ అని పిలుద్దాం అంటూ వ్యాఖ్యానించారు.

దీనికి బదులు వారి పేరును ఉపయోగించాలా? ప్రతిచోటా మనకు గౌరవం అవసరమా..? ఎవరినైనా పేరు పెట్టి పిలిస్తే చాలు గౌరవంగా ఉంటుంది అని కూడా నెటిజన్లు పేర్కొంటున్నారు.

ఇంకొకరు నేను ప్రతి డ్రైవర్‌ను “డ్రైవర్ సాహబ్” అని పిలుస్తాను.. ఎందుకంటే నేను ఒకసారి ఇలా పిలిస్తే.. క్యాబ్‌ నడిపే వ్యక్తి చాలా ఉప్పొంగిపోయాడు. ఎందుకంటే అతను క్యాబ్‌లు నడుపుతున్న 20 సంవత్సరాలలో అతనిని ఎవరూ సాహబ్ అని పిలవలేదు.. వెంటనే అతను సంతోషిస్తూ కొన్ని నిమిషాలు నాతో మాట్లాడాడు. ఇది అంత ప్రభావం చూపుతుందని నేను గ్రహించలేదు” అంటూ మరొక వినియోగదారు ట్వీట్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..