Crab-Turtle: క్యా సీన్ హై.. తాబేలును ఎత్తుకెల్లిపోయిన పీత.. ఇదేం విడ్డురం అంటున్న నెటిజనం..(వీడియో)
సముద్రపు జీవుల్లో పీతలకు ప్రత్యేక స్థానముంది. ప్రపంచంలో సుమారు 4వేల కంటే ఎక్కువ జాతుల పీతలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతారు. వీటిలో కొన్ని నీటీలోనూ, భూమిపైన కూడా నివసిస్తాయి.
సముద్రపు జీవుల్లో పీతలకు ప్రత్యేక స్థానముంది. ప్రపంచంలో సుమారు 4వేల కంటే ఎక్కువ జాతుల పీతలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతారు. వీటిలో కొన్ని నీటీలోనూ, భూమిపైన కూడా నివసిస్తాయి. అలాగే కొన్ని ప్రమాదకరమైన పీతలు కూడా ఉంటాయట. ఇదిలా ఉంటే చాలా చోట్ల ప్రజలు పీతలను ఆహారంగా తీసుకుంటారు. వీటికున్న రుచి కారణంగా చాలామంది వీటిని ఇష్టంగా తింటారు. అలాంటి పీతలకు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో సముద్రపు ఒడ్డున ఇసుకలో ఓ తాబేలు పిల్ల ఆహారం వెతుక్కుంటూ ఉంది. ఇంతలో ఓ పీత అక్కడికి వచ్చింది. వెంటనే తాబేలును కట్టర్స్ లాంటి దాని కాళ్లతో గట్టిగా పట్టేసుకుని అక్కడ్నుంచి వేగంగా వెళ్లిపోయింది. సాధారణంగా సింహం, పులి, చిరుత వంటి జంతువులు వేటాడడం మనం చూసాం.. కానీ పీత ఇలా చేయడం అందులోనూ ఒక తాబేలును వేటాడడం చాలా అరుదు. ఈ వీడియోను ఓ యూజర్ తన ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ వీడియోను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. వేలమంది ఈ వీడియోను వీక్షించగా వందల్లో లైక్ చేస్తున్నారు. ఇది క్రూరత్వమని కొందరు కామెంట్లు చేస్తుంటే.. తాబేలును సముద్రంలోకి తీసుకెళ్లేందుకు పీత సాయం చేస్తోందంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Nayanthara properties: నయనతారకు అన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా ? ఏకంగా హైదరాబాద్‍లోనే..
Pizza: మార్కెట్‌లో కొత్తరకం పిజ్జా.. అమ్మబాబోయ్.. దీన్ని పిజ్జా అంటారా.. వీడియో చూస్తే..