అరేయ్ ఏంట్రా ఇది.. బటర్‌ చికెన్‌తో ఐస్‌క్రీం తయారుచేసిన ఘనుడు.. వాంతి వస్తోందంటూ ఫుడ్‌ లవర్స్ ఆగ్రహం

మీరు ఎప్పుడైనా బటర్ చికెన్ ఐస్ క్రీం తిన్నారా ? ఇప్పుడు ఈ కొత్త ఐస్‌క్రీం ఏంటి? అని ఆలోచిస్తున్నారా? అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూడండి.

అరేయ్ ఏంట్రా ఇది.. బటర్‌ చికెన్‌తో ఐస్‌క్రీం తయారుచేసిన ఘనుడు.. వాంతి వస్తోందంటూ ఫుడ్‌ లవర్స్ ఆగ్రహం
Butter Chicken Ice Cream
Basha Shek

|

Sep 30, 2022 | 12:37 PM

ఐస్‌క్రీంలో ఎన్నో రకాలు, ఫ్లేవర్స్‌ ఉంటాయి. బట్టర్‌ స్కాచ్‌, స్ట్రాబెర్రీ, కోన్‌, చాక్లెట్‌.. ఇలా ఎన్నెన్నో వెరైటీలుంటాయి. మరి మీరు ఎప్పుడైనా బటర్ చికెన్ ఐస్ క్రీం తిన్నారా ? ఇప్పుడు ఈ కొత్త ఐస్‌క్రీం ఏంటి? అని ఆలోచిస్తున్నారా? అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూడండి. ఈ డెడ్లీ కాంబినేషన్ రెసిపీ చూసి జనాలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. వాంతులు వస్తున్నాయంటూ ఈ ఘనకార్యానికి కారణమైన వాడిపై మండిపడుతున్నారు.

వైరల్ అవుతున్న వీడియోలో, ఒక చెఫ్ బటర్‌ చికెన్‌ ఐస్‌క్రీం ఎలా తయారుచేస్తున్నాడో మనం చూడవచ్చు. ముందుగా ఒక కప్పులో బటర్ చికెన్ ప్యూరీని అందిస్తాడు. ఆతరువాత అదనపు రుచి, మసాలా టేస్ట్‌ వచ్చేందుక దానిపై పుదీనా చట్నీ టాప్‌ చేస్తాడు. ఢిల్లీలోని అలోఫ్ట్ ఏరోసిటీలో ఓ స్ట్రీట్‌ ఫుడ్‌ వ్యాపారి వింతైన వంటకం తయారుచేసి కస్టమర్‌కు అందించాడు.

వామ్మో.. ఇదేం కాంబినేషన్‌ ! ఫుడ్‌వూడిండియా పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఆహార ప్రియులు, ముఖ్యంగా ఐస్ క్రీం లవర్లు ఈ రెసిపీ చూసి షాక్ అవుతున్నారు. ‘ఈ డెడ్లీ కాంబినేషన్‌ ఎంట్రా బాబూ.. వాంతి వస్తోంది.. వీడు కచ్చితంగా నరకానికే పోతాడు’ అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu