AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Harsha Goenka: వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నారా.. అయితే మీరు ఈ ఫెసిలిటీస్ మిస్ అయినట్లే.. ఆసక్తి రేపుతున్న ట్వీట్

వర్క్ ఫ్రమ్ హోమ్.. ప్రస్తుతం ఈ మాట తెలియని వారు లేరనే చెప్పవచ్చు. ఎప్పుడైతే కరోనా మహమ్మారి ప్రపంచంపైపంజా విసిరందో.. అప్పటి నుంచి అన్ని రకాల ఉద్యోగాలు, పనులు కకావికలమయ్యాయి. కొన్ని పనులు..

Harsha Goenka: వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నారా.. అయితే మీరు ఈ ఫెసిలిటీస్ మిస్ అయినట్లే.. ఆసక్తి రేపుతున్న ట్వీట్
Harsha Goenka
Ganesh Mudavath
|

Updated on: Sep 30, 2022 | 1:21 PM

Share

వర్క్ ఫ్రమ్ హోమ్.. ప్రస్తుతం ఈ మాట తెలియని వారు లేరనే చెప్పవచ్చు. ఎప్పుడైతే కరోనా మహమ్మారి ప్రపంచంపైపంజా విసిరందో.. అప్పటి నుంచి అన్ని రకాల ఉద్యోగాలు, పనులు కకావికలమయ్యాయి. కొన్ని పనులు నిలిచిపోగా.. మరికొన్ని ముఖ్యమైన పనులు ఆగకుండా ఉండేందుకు ఈ విధానం చక్కగా ఉపయోగపడింది. లాక్ డౌన్, కరోనా కేసుల పెరుగుదల కారణంగా ఉద్యోగులు ఆఫీస్లకు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. ఈ పరిస్థితి కారణంగా అటు పని ఆగిపోకుండా.. ఇటువైపు ఉద్యోగులకు ఇబ్బందులు కలగకుండా యాజమాన్యాలు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కు ఓకే చెప్పాయి. దీంతో చాలా మంది ఉద్యోగులు పెట్టేబేడా సర్దుకుని సొంతూళ్లకు వెళ్లిపోయారు. అక్కడి నుంచే పనిచేయడం ప్రారంభించారు. అయితే.. కొంత కాలంగా కరోనా కేసుల పెరుగుదల తగ్గడం, వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తవడం, రోగ నిరోధక శక్తి పెరగడంతో ఆఫీస్ లు మళ్లీ తెరుచుకున్నాయి. అయితే ఇక్కడే ఓ చిక్కు వచ్చి పడింది. ఊళ్లకు వెళ్లిపోయిన ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు రప్పించుకునేందుకు యాజమాన్యాలు తీవ్రంగా శ్రమించాయి. వారికి ఆఫర్లు, ప్యాకేజీలు అందిస్తూ కార్యాలయాల బాట పట్టించాయి. ఈ క్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త హర్ష గోయోంకా చేసిన ట్వీట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

కరోనాకు ముందు వర్క్‌ ఫ్రమ్‌ హోం అనే పదం పెద్దగా వినిపించేది కాదు. కానీ మహమ్మారి కాలంలో ఇది అత్యంత వాడుకలోకి వచ్చింది. ఉద్యోగులు ఇంటి నుంచే కార్యకలాపాలు చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో హర్ష గోయోంకా చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ఈ పోస్ట్‌లో రెండు ఛార్టులు ఉన్నాయి. మొదటి పై ఛార్ట్ ‘వర్కింగ్‌ ఫ్రమ్‌ హోం’కు సంబంధించింది. అది మొత్తం పనితోనే నిండిపోయింది. అదే ‘వర్కింగ్‌ ఫ్రమ్‌ ఆఫీస్‌’ అని గీసిన ఛార్ట్‌లో చాలా విషయాలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

కాఫీ, లంచ్‌ బ్రేక్ తీసుకోవచ్చు, ట్రాఫిక్‌లో కొద్దిసేపు వేచి ఉండొచ్చు, ఇంకొద్ది సేపు మన పనిచేసుకొని, మన తోటివారికి సహాయం చేయవచ్చు. అని ఆ ఛార్ట్‌లో పేర్కొన్నారు.  అంతే కాకుండా పోస్ట్ కు ఆసక్తికర లైనప్ ను ట్యాగ్ చేశారు. మీరు ఆఫీస్‌ నుంచే పనిచేయాలనేందుకు కారణమిదే అని రాశారు. ఇది సోషల్ మీడియాలో తక్షణమే వైరల్ అయింది. పోస్ట్ చూసిన నెటిజన్లు గోయోంకా ట్వీట్ పై భిన్నంగా స్పందిస్తున్నారు. అంతే కాకుండా తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో రాస్తున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..