EMI చెల్లించేవారికి షాకింగ్ న్యూస్.. రెపో రేట్లు పెంచిన ఆర్బీఐ.. ఇకపై ఎంత భారం పడనుందంటే.?

గత ఏడాదిగా ఆర్బీఐ రెపోరేటు పెంచడం ఇది నాలుగోసారి. దీంతో గృహ, వాహన రుణాలు మరింత ప్రియం కానున్నాయి.

EMI చెల్లించేవారికి షాకింగ్ న్యూస్.. రెపో రేట్లు పెంచిన ఆర్బీఐ.. ఇకపై ఎంత భారం పడనుందంటే.?
Reserve Bank Of India
Follow us
Ravi Kiran

|

Updated on: Sep 30, 2022 | 12:30 PM

వడ్డీ రేట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ద్రవ్య విధానంలో భాగంగా రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ఇవాళ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. దీంతో రెపోరేటు 5.40 శాతం నుంచి 5.90 శాతానికి చేరింది. గత ఏడాదిగా ఆర్బీఐ రెపోరేటు పెంచడం ఇది నాలుగోసారి. దీంతో గృహ, వాహన రుణాలు మరింత ప్రియం కానున్నాయి. మీరు కూడా ప్రతీ నెలా ఈఎంఐ చెల్లిస్తుంటే.! ఇకపై అది కాస్తా భారం కానుంది.. మరి ఎంత పెరుగుతుంది.? ఏంటి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం..

EMI భారం ఎంత పడనుంది.?

మీరు రూ.20 లక్షల గృహ రుణం తీసుకున్నారని అనుకుందాం. రుణ కాలవ్యవధి 20 సంవత్సరాలు. కాబట్టి, ఇప్పుడు మీరు 8 శాతం వడ్డీ రేటుతో నెలకు రూ. 16,729 EMI చెల్లించాలి. ఇంతకు ముందు 7.5 శాతం వడ్డీ రేటు ప్రకారం, మీ నెలవారీ EMI రూ. 16,112. అంటే, ఇప్పుడు మీ నెలవారీ EMIపై రూ. 617 పడింది. కొత్త వడ్డీ రేటు ప్రకారం, మీరు మొత్తం రూ. 20,14,912 వడ్డీని చెల్లించాలి. అంతకుముందు మొత్తం వడ్డీ రూ.18,66,846. అంటే, మీరు మొత్తం రూ.1,48,066 అదనపు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.

అదే సమయంలో, మీరు 20 సంవత్సరాల కాలపరిమితితో రూ. 30 లక్షల గృహ రుణం తీసుకున్నట్లయితే, ఇప్పటివరకు మీరు నెలవారీ రూ.24,168 EMI చెల్లిస్తూ వచ్చారు. అలాగే ఈ లెక్కతో క్యాలికులేట్ చేసుకుంటే.. మీ మొత్తం వడ్డీ రూ. 28,00,273. అయితే వడ్డీ రేటును 0.5 శాతం పెంచిన తర్వాత, మీరు ప్రతి నెలా రూ. 25,093 EMI చెల్లించాలి. మీ కాలపరిమితిలో మొత్తంగా రూ. 30,22,367 వడ్డీని కట్టాలి. వడ్డీ రేటు పెరిగిన తర్వాత, మీ నెలవారీ EMIపై రూ. 925 భారం పడింది. అదే సమయంలో, 20 సంవత్సరాలలో, మీరు రూ. 2,22,094 అదనపు వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది.

ఈ విషయాలను గుర్తుంచుకోండి:

RBI ఇతర బ్యాంకులకు రుణాలు ఇచ్చే రేటునే ‘రెపో రేటు’ అని అంటారు. రెపో రేటు పెంపు వల్ల బ్యాంకులు రుణాలు తీసుకోవడానికి అధిక వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఆయా బ్యాంకులు ఆ భారాన్ని తమ ఖాతాదారులపై వేస్తాయి. రెపో రేటు పెరిగిన తర్వాత రుణాలకు సంబంధించిన వడ్డీ రేటును ఎప్పుడు.? ఎంత పెంచాలన్నది బ్యాంకుల నిర్ణయం.

రెపో రేటు పెంపు తర్వాత మీ EMIపై భారం పడేది మీరు ఎంచుకున్న వడ్డీ రేటును కూడా నిర్ణయిస్తుంది. ఇదిలా ఉంటే.. రెపో రేటు పెరిగినా, లేదా తగ్గినా ఫిక్స్‌డ్ రేట్ లోన్స్ వడ్డీ రేట్లలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. అదే సమయంలో, మిగతా లోన్స్‌కు సంబంధించిన ఈఎంఐలపై మాత్రం రెపోరేటు మార్పు ప్రభావం పడుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..