RBI Repo Rate Hike: మరోసారి షాకిచ్చిన ఆర్‌బీఐ.. పెరగనున్న ఈఎమ్ఐలు.. వరుసగా నాలుగోసారి..

దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెటింగ్ పతనం, రూపాయి క్షీణత పలు ఆందోళనల మధ్య భారతీయ రిజర్వ్ బ్యాంక్ శుక్రవారం 50 బేసిస్ పాయింట్ల (bps) పాలసీ రేటు పెంపును ప్రకటించింది.

RBI Repo Rate Hike: మరోసారి షాకిచ్చిన ఆర్‌బీఐ.. పెరగనున్న ఈఎమ్ఐలు.. వరుసగా నాలుగోసారి..
Shaktikanta Das
Follow us

|

Updated on: Sep 30, 2022 | 11:07 AM

దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెటింగ్ పతనం, రూపాయి క్షీణత లాంటి ఆందోళనల మధ్య భారతీయ రిజర్వ్ బ్యాంక్ శుక్రవారం 50 బేసిస్ పాయింట్ల (bps) పాలసీ రేటు పెంపును ప్రకటించింది. ద్రవ్య విధాన కమిటీ (MPC) సెప్టెంబర్ సమావేశంలో ఆర్బీఐ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. FY23 వార్షిక సంవత్సర GDP శాతం 7.2 నుంచి 7.0%కి తగ్గుతుందని అంచనా వేసింది. ఆర్బీఐ తాజాగా నిర్ణయంతో పండుగ సీజన్‌లో EMI మరింత ఖరీదైనదిగా మారనుంది. వరుసగా నాలుగోసారి రెపో రేటును పెంచుతూ ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంది. RBI రెపో రేటును 5.40 శాతం నుండి 5.90 శాతానికి పెంచింది. రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచింది. ఆర్‌బీఐ ద్రవ్య విధాన సమావేశం అనంతరం శుక్రవారం గవర్నర్ శక్తికాంత దాస్ ఈ విషయాన్ని ప్రకటించారు. అంటే ఇప్పుడు ఐదు నెలల్లో 1.90 శాతం రెపో రేటు పెరిగింది. ఇది మూడు నెలలపాటు అమల్లో ఉండనుంది. ప్రతీ మూడు నెలలకొకసారి ప

EMI మరింత ప్రియం..

RBI నిర్ణయం తర్వాత గృహ రుణం నుంచి కారు రుణం, విద్యా రుణం వరకు అన్ని ఖరీదైనవిగా మారనున్నాయి. ఇప్పటికే గృహ రుణం తీసుకున్న వారి ఈఎంఐ కూడా పెరగనుంది. మానిటరీ పాలసీ కమిటీ సమావేశం ముగిసిన మూడు రోజుల తర్వాత ఆర్బీఐ గవర్నర్ రెపో రేటును పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

ఆర్థిక మంత్రిత్వ శాఖ కొన్ని చిన్న మొత్తాల పొదుపు పథకాలపై కూడా వడ్డీ రేట్లను పెంచింది. అక్టోబర్-డిసెంబర్ మధ్యకాలంలో 10 బేసిస్ పాయింట్ల నుంచి 30 బేసిస్ పాయింట్లకు పెంచింది. వరుసగా తొమ్మిది త్రైమాసికాల్లో వాటిని యథాతథంగా ఉంచిన తర్వాత తాజాగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. వివిధ పథకాలపై వడ్డీ రేట్లు ఇప్పుడు 4 శాతం నుంచి 7.6 శాతం వరకు పెరగనున్నాయి.

ద్రవ్యోల్బణం పెరుగుదల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ద్రవ్య విధాన కమిటీ సమావేశం సెప్టెంబర్ 28 నుంచి ప్రారంభమైంది. ఆగస్టు నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 7 శాతంగా ఉంది. దీంతో ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు ఆర్‌బీఐ వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకోవలసి వచ్చింది.

2022-23 ఆర్థిక సంవత్సరంలో నాల్గవసారి..

ద్రవ్యోల్బణం పెరిగిన తర్వాత వరుసగా నాల్గవసారి రెపో రేటును పెంచాలని RBI నిర్ణయించింది. మే 4న రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు పెంచి 4.40 శాతానికి చేరింది. ఆ తర్వాత జూన్ 8న 50 బేసిస్ పాయింట్లు పెంచగా, ఆ తర్వాత ఆగస్టులో మళ్లీ రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచారు. అనంతరం ఈ రోజు (సెప్టెంబర్ 30, 2022) రెపో రేటు మళ్లీ 50 బేసిస్ పాయింట్లు పెరిగింది. ఆర్‌బీఐ ఈ నిర్ణయం తర్వాత రెపో రేటు 1.90 శాతం పెరిగింది. ఆర్‌బీఐ తాజా నిర్ణయం తర్వాత ప్రభుత్వ బ్యాంకుల నుంచి ప్రైవేట్‌ వరకు రుణాలు ఖరీదైనవిగా మారనున్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..