Jio 5g: భారతీయులకు మెరుగైన 5జీ సేవలు అందించడమే మా లక్ష్యం.. జియో స్పష్టీకరణ..
దేశంలో అక్టోబర్ 1వ తేదీ నుంచి 5జీ సేవలు అందుబాటులోకి వస్తోన్న విషయం తెలిసిందే. భారత ప్రధాని నరేంద్రమోదీ ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ)లో 5జీ సేవలను ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో టెలికం సంస్థలన్నీ వినియోగదారులకు 5జీ సేవలు అందించేందుకు సిద్ధమయ్యాయి...
దేశంలో అక్టోబర్ 1వ తేదీ నుంచి 5జీ సేవలు అందుబాటులోకి వస్తోన్న విషయం తెలిసిందే. భారత ప్రధాని నరేంద్రమోదీ ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ)లో 5జీ సేవలను ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో టెలికం సంస్థలన్నీ వినియోగదారులకు 5జీ సేవలు అందించేందుకు సిద్ధమయ్యాయి. ఇక మొబైల్ కంపెనీలు సైతం 5జీ ఆధారిత మొబైల్ ఫోన్లను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ టెలికం సంస్థ రిలయన్స్ జియో తమ వినియోగదారులకు ‘True 5G’ (అసలైన 5జి) సేవలు అందిస్తామని, తాము ఇచ్చిన నిలబెట్టుకునేందుకు సర్వసన్నద్ధంగా ఉందని తెలిపింది.
వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడంలో జియో మొదటి నుంచి కీలక అడుగులు వేసింది. 5జీ సేవలకు అవసరమైన అతిపెద్ద, అత్యంత సముచిత సమ్మేళనంగా వైర్లెస్ స్పెక్ట్రమ్‌ను పొందడంతోనే ఇది ప్రారంభమైంది. జియో సంస్థ 5జీ స్పెక్ట్రమ్‌ను 3500 MHz మిడ్ బ్యాండ్ విభాగంలో పొందింది. ప్రపంచవ్యాప్తంగా 5జీ కోసం కేటాయించేది దీన్నే. ఇక అల్ట్రా హై కెపాసిటీ కోసం 26 GHz మిల్లీమీటర్ – వేవ్ బ్యాండ్ ను పొందింది. జియో 5జీ సేవల విషయమై రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ ఇటీవల జరిగిన వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం)లో మాట్లాడుతూ.. ‘స్టాండ్ అలోన్ 5జీ ఆర్కిటెక్చర్, అతిపెద్ద, అత్యుత్తమ స్పెక్ట్రమ్ సమ్మేళనం, క్యారియర్ అగ్రిగేషన్…ఈ మూడింటి ప్రయోజనమే జియో 5జీ. వీటితో ఇది కవరేజ్, కెపాసిటీ, క్వాలిటీ, అందుబాటు ధరల తిరుగులేని సమ్మేళనాన్ని అందించనుంది’ అని చెప్పుకొచ్చారు.
ఇక వాటాదారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘జియో 5జీ ప్రపంచపు అతిపెద్ద, అత్యంత అధునాతన 5జీ నెట్ వర్క్ కానుంది. ఇందుకోసం మేం స్టాండ్ అలోన్ 5జీని ఉపయోగించనున్నాం. 5జీ సేవలు అందించేందుకు గాను 4జీ నెట్‌వర్క్‌పై ఏమాత్రం ఆధారపడం’ అని తెలిపారు. ఇదిలా ఉంటే ప్రత్యర్థి సంస్థలు మాత్రం నాన్-స్టాండ్ అలోన్ 5జీ వైపు చూస్తున్నాయి. అవి అలా చూడడం అంటే, 5జిని నామమాత్రంగా అందించడమే అవుతుందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 700 MHz బ్యాండ్ లో ఖరీదైన స్పెక్ట్రమ్ ను పొందిన క్యారియర్ జియో ఒక్కటే కావడం విశేషం. దీన్ని పొందేందుకు గాను ఈ ఏడాది మొదట్లో జరిగిన వేలంలో ఇది సుమారుగా రూ.40,000 కోట్లను వెచ్చించింది.
ఇదిలా ఉంటే జియో దీపావళి నాటికి దేశంలోని మెట్రో నగరాలతో పాటు మరికొన్ని ముఖ్య నగరాల్లో 5జీ సేవలను ప్రారంభించనుంది. ఆ తర్వాత దశలవారీగా నెలవారీ విస్తరణలతో 2023 డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా 5జీని అందుబాటులోకి తీసుకురానుంది. జియో 5జీ నిర్మాణం కోసం రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు జియో ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..