మహీంద్రా నుంచి ఎలక్ట్రిక్‌ ఆటో.. సింగిల్‌ ఛార్జ్‌తో 200కి.మీ రేంజ్‌

14 February, 2026

Subhash

దేశంలో అతిపెద్ద ఎలక్ట్రిక్‌ కమర్షియల్‌ వాహన తయారీ సంస్థ మహీంద్రా లాస్ట్‌ మైల్‌ మొబిలిటీ లిమిటెడ్‌.. తాజాగా దేశీయ మార్కెట్‌కు ప్యాసింజర్‌ ఎలక్ట్రిక్‌ ఆటోను పరిచయం చేసింది. 

ఎలక్ట్రిక్‌

‘ఉడో’ పేరుతో విడుదల చేసిన ఈ ఆటోను ప్రారంభ ధర 3,58, 999 రూపాయలుగా నిర్ణయించింది కంపెనీ.

ఈ ఆటోను ప్రారంభ ధర 

స్వల్పకాలం మాత్రమే ఈ ధరలు అందుబాటులో ఉంటుందని, ఆ తర్వాత ఈ ధరను 3,84,299 రూపాయలకు పెంచుతామని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.

ఎలక్ట్రిక్‌ ఆటో

హైదరాబాద్‌కు సమీపంలోని జహీరాబాద్‌లో ఉన్న ఉత్పత్తి కేంద్రంలో ఈ ఎలక్ట్రిక్‌ ఆటోను తయారు చేసినట్టు మహీంద్రా లాస్ట్‌ మైల్‌ మొబిలిటీ లిమిటెడ్‌ సీఈవో, ఎండీ సుమన్‌ మిశ్రా తెలిపారు. 

జహీరాబాద్‌ ప్లాంట్లో తయారీ

ఈ ఆటోను ఉత్పత్తి చేయడానికి రూ.500 కోట్లు పెట్టుబడిగా పెట్టినట్టు, ఏడాదికి రెండు లక్షల యూనిట్ల సామర్థ్యం కలిగిన ప్రత్యేక లైన్‌ను నెలకొల్పినట్టు చెప్పారు.

ఆటో

దేశవ్యాప్తంగా ఇప్పటికే ముందస్తు బుకింగ్‌ చేసుకున్న కస్టమర్లకు ఈ వారాంతం డెలివరీ చేయనున్నట్టు ఆమె ప్రకటించారు.

దేశవ్యాప్తంగా

సింగిల్‌ చార్జింగ్‌తో 200 కిలోమీటర్లు మైలేజీ, 11.7 కిలోవాట్ల బ్యాటరీ, గంటకు 55 కిలోమీటర్లు వేగంతో ప్రయాణించనుంది.

సింగిల్‌ చార్జింగ్‌తో

ఈ ఆటోపై ఆరేండ్లు లేదా 1.5 లక్షల కిలోమీటర్ల వ్యారెంటీ అందిస్తున్నట్లు, లక్ష కిలోమీటర్ల వరకు ఉచిత సర్వీసింగ్‌, రూ.20లక్షల ప్రమాద బీమా ఉందన్నారు.

ప్రమాద బీమా