AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO: జస్ట్ ఈ నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే చాలు.. సెకన్లలోనే మీ పీఎఫ్ బ్యాలెన్స్ వచ్చేస్తుంది.. సేవ్ చేసి పెట్టుకోండి..

పీఎఫ్ బ్యాలెన్స్ ఎలా తెలుసుకోవాలనే అనుమానం చాలామందికి ఉంటుంది. కొంతమంది ఈపీఎఫ్‌వో వెబ్‌సైట్లోకి వెళ్లి తెలుసుకుంటే.. మరికొంతమంది ఉమాంగ్ యాప్ ద్వారా తెలుసుకుంటారు. అయితే మిస్డ్ కాల్ ద్వారా కూడా పీఎఫ్ బ్యాలెన్స్ ఎంత ఉంది. చివరిగా ఎంత జమ అయింది అనే వివరాలు తెలుసుకోవచ్చు.

EPFO: జస్ట్ ఈ నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే చాలు.. సెకన్లలోనే మీ పీఎఫ్ బ్యాలెన్స్ వచ్చేస్తుంది.. సేవ్ చేసి పెట్టుకోండి..
Epfo
Venkatrao Lella
|

Updated on: Feb 18, 2026 | 1:44 PM

Share

ఉద్యోగులకు ఉపయోగపడేలా ఈపీఎఫ్‌వో అనేక నిర్ణయాలు తీసుకుంటుంది. ఈపీఎఫ్ సేవలను మరింత సులభతరం చేస్తోంది. క్షణాల్లోనే పీఎఫ్ సేవలను యాక్సెస్ చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తోంది. ఈ క్రమంలో క్షణాల్లోనే పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ సర్వీస్ ఎప్పటినుంచో అందుబాటులో ఉన్నా.. ఇప్పటివరకు చాలామందికి తెలియక ఉపయోగించుకోలేకపోతున్నారు. గతంలో పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవాలంటే ఈపీఎఫ్‌వో పోర్టల్ లేదా ఉమాంగ్ యాప్ ఓపెన్ చేయాల్సి వచ్చేది. కానీ పోర్టల్ టెక్నికల్, సర్వర్ ప్రాబ్లమ్స్ వల్ల ఓపెన్ కాక ఇబ్బంది పడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు జస్ట్ మీ మొబైల్‌ నుంచి ఒక నెంబర్‌కు కాల్ చేయడం వల్ల మీ పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. అదెలానో ఇప్పుడు చూద్దాం.

ప్రతీ నెలా అకౌంట్లో జమ

కంపెనీ ప్రతీ నెలా ఉద్యోగి అకౌంట్లో శాలరీ నుంచి కట్ చేసిన పీఎఫ్ సొమ్మును జమ చేస్తూ ఉంటుంది. శాలరీ పడ్డ కొన్ని రోజుల తర్వాత వీటిని యాజమాన్యం పీఎఫ్ ఖాతాలో వేస్తారు. ఒక్కొక్కసారి జమ చేయడం ఆలస్యం కూడా కావొచ్చు. ఇలా ప్రతీ నెలా మీ పీఎఫ్ అకౌంట్లో కంపెనీ నగదు జమ చేసిందా.. లేదా అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. ప్రతీసారి పోర్టల్ లేదా యాప్ ఓపెన్ చేసి చూడాల్సిన అవసరం లేకుండా కేవలం మిస్డ్ కాల్ ద్వారా తెలుసుకునే ఫెసిలిటీని కేంద్రం తీసుకొచ్చింది. దీని ద్వారా ప్రతీ నెలా మీ అకౌంట్లో పడే నగదు వివరాలు తెలుసుకోచ్చు. మీ బేసిక్ శాలరీలో 12 శాతం పీఎఫ్ కట్ చేస్తారు. కంపెనీ అందుకు సమానంగా 12 శాతం కలిపి పీఎఫ్ అకౌంట్‌లో జమ చేయల్సి ఉంటుంది. ఇందులో 8 శాతం పెన్షన్ స్కీమ్‌లో జమ అయితే.. మిగతా 3 శాతం పీఎఫ్ అకౌంట్‌కు వస్తుంది. మీరు 10 ఏళ్ల పాటు ఈపీఎఫ్‌వో సర్వీస్ పూర్తి చేసుకుంటే 58 ఏళ్లు నిండిన తర్వాత మీకు నెలనెలా పెన్షన్ అందుతుంది.

మిస్డ్ కాల్ ద్వారా..

-ఈపీఎఫ్ఓతో అనుసంధానమైన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 99660 44425కు మిస్డ్ కాల్ ఇవ్వండి -ఒక్కసారి ఫోన్ రింగ్ అయ్యి వెంటనే కట్ అవుతుంది -ఆ తర్వాత కొన్ని సెకన్ల వ్యవధిలోనే మీ ఫోన్‌కు టెక్ట్స్ మెస్సేజ్ రూపంలో పీఎఫ్ బ్యాలెన్స్ వివరాలు అందుతాయి -చివరి కాంట్రిబ్యూషన్ ఎంత అనేది కూడా తెలుస్తుంది -మీ యూనివర్సల్ అకౌంట్ నెంటర్ యాక్టివ్‌గా ఉంటేనే మిస్డ్ కాల్ సదుపాయం పనిచేస్తుంది -కేవైసీ పూర్తి చేసి ఉండాలి -ఈపీఎఫ్‌వోతో మీ మొబైల్ లింక్ అయి ఉండాలి

Follow Us