అలా ఓట్లు అడిగేందుకు కాంగ్రెస్ పార్టీకి సిగ్గుండాలి.. సంగారెడ్డిలో షర్మిల ఘాటు వ్యాఖ్యలు..
రాజశేఖర్ రెడ్డి పేరు చెప్పి ఓట్లు అడగటానికి కాంగ్రెస్ పార్టీకి సిగ్గుండాలంటూ వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన బతికి ఉంటే ఏం జరిగేదో తెలుసా అంటూ విరుచుకుపడ్డారు.
తెలంగాణలో పాదయాత్ర చేస్తున్న వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల సమయం దొరికినప్పుడుల్లా ప్రత్యర్థులపై పంచ్‌లు విసురుతున్నారు. అదును చూసి పదునైన వ్యాఖ్యలతో విరుచుకపడుతున్నారు. రాజశేఖర్ రెడ్డి మరణం, కాంగ్రెస్ పార్టీపై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారామె. వైఎస్సార్‌కి కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడిచిందంటూ మండిపడ్డారు. వైఎస్ 30 ఏళ్లు కాంగ్రెస్ పార్టీకి సేవ చేశారు. 2004, 2009లో రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారన్నారామె. వైఎస్సార్ పాదయాత్ర చేస్తే ప్రజలు ఆశీర్వదించారన్న షర్మిల.. కేంద్రంలో కూడా కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవడంలో కీలక పాత్ర పోషించారన్నారు.
ఇంత జరిగినా వైఎస్ చనిపోతే దోషి అని కాంగ్రెస్ పార్టీ FIR నమోదు చేసిందంటూ మండిపడ్డారు. ఇది వైఎస్సార్‌కి వెన్నుపోటు పొడిచినట్లు కాదా.. రాజశేఖర్ రెడ్డిని మోసం చేసినట్లు కాదా అని ప్రశ్నించారు. రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో ఎలా చనిపోయాడని, దర్యాప్తు కూడా చేయించలేదంటూ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైయస్ఆర్ 30ఏండ్లుగా కాంగ్రెస్ లో ఉండి, రెండు సార్లు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి, కేంద్రంలోనూ అధికారంలోకి వచ్చేలా చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ వైయస్ఆర్ పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చి వెన్నుపోటు పొడిచింది.ఆయన మరణంపైనా కనీసం ఎంక్వైరీ చేయలేదు.#MataMuchata #PrajaPrasthanam #Narsapur pic.twitter.com/9uFZPjLhGR
— YS Sharmila (@realyssharmila) September 29, 2022
వైఎస్ ఫొటో పెట్టుకొని ఓట్లు అడగటానికి కాంగ్రెస్ పార్టీకి సిగ్గుండాలంటూ మండిపడ్డారు. వైఎస్ బతికి ఉంటే పార్టీపై ఉమ్మి వేసేవాడన్నారు. కాంగ్రెస్ పార్టీకి వైఎస్ ఖ్యాతి తెచ్చారు. కానీ వైఎస్సార్‌కు పార్టీ ఖ్యాతి తేలేదంటూ కామెంట్ చేశారు.
వైయస్ఆర్ హయాంలో ఎవుసం పండగైంది. ఉచిత విద్య, వైద్యం అందింది. బడులు బాగుపడ్డాయి. పిల్లలకు స్కాలర్ షిప్ లు, ఫీజు రీయింబర్స్ మెంట్ అందాయి. మహిళలు ఆర్థికంగా ఎదిగారు. మళ్లీ వైయస్ఆర్ సంక్షేమ పాలన రావాలన్నా.. సమస్యలు తొలగిపోవాలన్నా.. YSR తెలంగాణ పార్టీని ఆశీర్వదించండి.#MataMuchata pic.twitter.com/9sTgEHF1AA
— YS Sharmila (@realyssharmila) September 29, 2022
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..