- Telugu News Photo Gallery Cricket photos Ind vs sa team india young player suryakumar yadav records most sixes in t20i in a year most runs for india
‘సిక్సర్ కింగ్’గా మారిన మిస్టర్ 360 ప్లేయర్.. రోహిత్ నుంచి రిజ్వాన్ వరకు అంతా వెనుకంజలోనే..
దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లోనూ సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీ సాధించి, కష్టతరమైన పిచ్‌లో టీమిండియాను గెలిపించడంతోపాటు రికార్డులు కూడా సృష్టించాడు.
Updated on: Sep 29, 2022 | 7:55 AM

టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ జోరు కొనసాగుతోంది. ఆస్ట్రేలియాపై మంచి ఇన్నింగ్స్ ఆడిన ఈ యంగ్ 360 ప్లేయర్.. దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి T20 మ్యాచ్‌లో సూర్య క్లిష్ట పరిస్థితుల్లో మ్యాచ్ విన్నింగ్ హాఫ్ సెంచరీని సాధించాడు. తన ఇన్నింగ్స్ సమయంలో సూర్య కొన్ని రికార్డులను కూడా నెలకొల్పాడు.

తిరువనంతపురంలో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ కేవలం 33 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 50 పరుగులతో అజేయంగా నిలిచాడు.

ఈ ఇన్నింగ్స్‌తో, సూర్యకుమార్ యాదవ్ ఒక సంవత్సరంలో అత్యధిక T20 అంతర్జాతీయ పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. సూర్య ఈ ఏడాది 21 ఇన్నింగ్స్‌ల్లో 732 పరుగులు చేశాడు. ఇది 2018లో శిఖర్ ధావన్ చేసిన 689 పరుగుల కంటే ఎక్కువ.

ఇది మాత్రమే కాదు, సూర్యకుమార్ యాదవ్ ఒక సంవత్సరంలో అత్యధిక T20 అంతర్జాతీయ సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఇప్పటివరకు సూర్య 45 సిక్సర్లు కొట్టడం ద్వారా 2021లో మహ్మద్ రిజ్వాన్ (42) రికార్డును బద్దలు కొట్టాడు.

ఇది కాకుండా ఒక సంవత్సరంలో భారత విజయంలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌లలో సూర్యకుమార్ మూడవ స్థానంలో నిలిచాడు. అతని పేరు మీద 511 పరుగులు వచ్చాయి. రోహిత్ శర్మ (578 పరుగులు - 2018), విరాట్ కోహ్లీ (513 పరుగులు, 2016) అతని కంటే ముందున్నారు.





























