దేశంలో వంట గ్యాస్ కొరత తీవ్రమైంది. పశ్చిమాసియా యుద్ధం కారణంగా ఈ సంక్షోభం మరింత పెరిగింది. దీనితో కేంద్రం గ్రామీణ ప్రాంతాల్లో ఎల్పీజీ బుకింగ్ గడువును 25 రోజుల నుంచి 45 రోజులకు పొడిగించింది. పట్టణ ప్రాంతాల్లో మాత్రం గడువు 25 రోజులుగానే ఉంది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.