AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: రాత్రిపూట పాలు తాగుతున్నారా.. ఇలాంటి వారు ప్రమాదంలో పడ్డట్లే..

ఆరోగ్యంగా ఉండాలంటే పాలు తీసుకోవడం చాలా అవసరం. పాలలో కాల్షియంతో సహా అనేక పోషకాలు ఉన్నాయి. ఇవి మన ఎముకలు, దంతాలను బలంగా ఉంచుతాయి. కానీ, పాలు కూడా మనకు హాని కలిగిస్తాయని మీకు తెలుసా.

Venkata Chari
|

Updated on: Sep 29, 2022 | 7:30 AM

Share
బలమైన ఎముకలు ఆరోగ్యవంతమైన శరీరానికి సంకేతం. ఇందుకోసం వైద్యులు, ఆరోగ్య నిపుణులు పాలు తాగాలని సూచిస్తున్నారు. కానీ, పాలు కూడా మనకు హాని కలిగిస్తాయని మీకు తెలుసా. రాత్రి పాలు తాగితే మాత్రం కొన్ని ఆరోగ్య సమ్యలు తీవ్రమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

1 / 5
మొటిమలు: మీ చర్మంపై మొటిమలు నిరంతరం వస్తుంటే, మీరు రాత్రి పాలు తాగిన తర్వాత నిద్రపోకూడదు. పాల ఉత్పత్తులు యువతలో మొటిమలను కూడా ప్రేరేపిస్తాయని నివేదికలు వెల్లడించాయి. పాల ఉత్పత్తులు ఎగ్జిమాను మరింత తీవ్రతరం చేస్తాయని అనేక పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.

2 / 5
అలర్జీలు: ఏ రకమైన అలర్జీ ఉన్నవారు పాలు వంటి పాల ఆహారాన్ని తక్కువగా తీసుకోవాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. అలాంటి వారు రాత్రిపూట పాలు అస్సలు తినకూడదు. పాలు చర్మం లేదా ఇతర భాగాలపై అలెర్జీల సమస్యను మరింత తీవ్రతరం చేస్తుందని నమ్ముతారు.

3 / 5
ఫ్రాక్చర్: శరీరంలో ఎక్కడైనా గాయం అయితే పసుపు పాలు తాగడం మంచిది. అయితే ఇది ఎముక పగుళ్లకు కూడా కారణమవుతుందని మీకు తెలుసా. ఇది డి-గెలాక్టోస్ అనే చక్కెరను కలిగి ఉంటుంది. ఇది అధికంగా తాగితే ప్రయోజనం కాకుండా ఎముకలకు హాని కలిగిస్తుంది.

4 / 5
క్యాన్సర్: పాలు లేదా ఇతర డైరీ ఫుడ్స్ ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని మరింత పెంచుతాయని నిపుణులు సూచిస్తున్నారు. పాలలో ఉండే క్యాల్షియం ఈ రకమైన క్యాన్సర్‌ను ప్రోత్సహిస్తుందని చెబుతున్నారు. దీని అధిక వినియోగం అండాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది.

5 / 5