Tamil Nadu: బామ్మా.. మీరు చాలా గ్రేట్.. ఉచిత బస్సుల్లోనూ టికెట్ కొనే ప్రయాణం.. కండక్టర్‌తో వాదించి మరీ..
ఒక వృద్ధురాలు మాత్రం ఉచిత బస్సుల్లోనూ టికెట్ కొనుక్కునే జర్నీ ప్రయాణం చేస్తానంటోంది. అంతేకాదు ఉచిత బస్సుల్లో టికెట్ ఇవ్వనందుకు కండక్టర్‌తో సైతం గొడవ పడింది.
ప్రభుత్వ బస్సుల్లో ప్రయాణమంటే చాలామందికి ఇష్టముండదు. సొంత వాహనాలు లేకుండా ఉండి మరీ అవసరమైతే తప్ప సర్కారు బస్సుల్లో ప్రయాణించరు. అదే బస్సుల్లో ఉచిత ప్రయాణమంటే మాత్రం ఎగిరి గంతేస్తారు. పని ఉన్నా , లేకపోయినా బస్సులెక్కి ఫ్రీగా చక్కర్లు కొడుతుంటారు. అయితే ఒక వృద్ధురాలు మాత్రం ఉచిత బస్సుల్లోనూ టికెట్ కొనుక్కునే జర్నీ ప్రయాణం చేస్తానంటోంది. అంతేకాదు ఉచిత బస్సుల్లో టికెట్ ఇవ్వనందుకు కండక్టర్‌తో సైతం గొడవ పడింది. తమిళనాడులోని కోయంబత్తూర్లో ఈ ఘటన జరగ్గా.. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
ఫ్రీగా వెళ్లడానికి నో.. వివరాల్లో్కి వెళితే… అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలోని అధికార డీఎంకే పార్టీ రాష్ట్రంలోని మహిళలందరికీ ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. ఈ నేపథ్యంలోనే మధుకరాయ్ నుంచి పాలథురాయ్ వెళ్తున్న ఓ సర్కారీ బస్సులో వృద్ధురాలు ఎక్కింది. బస్సులో పురుషుల వద్ద టికెట్లు తీసుకుంటున్నాడు కండక్టర్. ఇదే సమయంలో తనకూ టికెట్ ఇవ్వాలంటూ కండక్టర్ వద్దకు వెళ్లి మరీ డబ్బులు ఇవ్వబోయింది వృద్ధురాలు. అయితే అందుకు కండక్టర్ నిరాకరించాడు. ప్రభుత్వ బస్సుల్లో ప్రయాణానికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని, ఉచితంగానే వెళ్లొచ్చని వృద్ధురాలికున్న ప్రత్యేక సదుపాయాన్ని వివరించే ప్రయత్నం చేశాడు. అయినా.. ఆ బామ్మ వెనక్కు తగ్గలేదు. తాను బస్సుల్లో ఉచితంగా వెళ్లాలనుకోవట్లేదని, టికెట్ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టింది. దీంతో చేసేదేమి లేక డబ్బులు తీసుకుని ముసలావిడకు టికెట్ ఇచ్చాడు కండక్టర్.
దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. పలువురు ప్రముఖులు, ఐఏఎస్ ఆఫీసర్లు, అధికారులు బామ్మ గొప్ప తనాన్ని మెచ్చుకుంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. బామ్మ.. మీరు చాలా గ్రేట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
While the specific buses are free for women in Tamilnadu this respectable old lady doesn’t want to use free bus instead she wanted to take ticket and travel. People in Tamilnadu have awakened against Freebies sponsored by Govt.Huge Respect!#sayNoTofreebies pic.twitter.com/P55d5VnS9D
— Dr.S.Abimanyu?? (@dr_abimanyus) September 29, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..