Knowledge: వాటర్‌ ట్యాంక్‌పై ఈ పైప్‌ ఎందుకు ఉంటుందో తెలుసా.? దీనికి పెద్ద కారణమే ఉందండోయ్‌..

'టీ' ఆకారంలో ఉండే ఈ పైప్‌ను కచ్చితంగా ట్యాంక్‌లకు ఏర్పాటు చేస్తారు. అయితే దీని ఉపయోగం ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా.? నిజానికి ఈ పైపు ద్వారా నీరు లోపలికి కానీ, బయటకు కానీ వెళ్లదు. అసలు నీటి కోసం దీనిని ఉపయోగించం కానీ...

Knowledge: వాటర్‌ ట్యాంక్‌పై ఈ పైప్‌ ఎందుకు ఉంటుందో తెలుసా.? దీనికి పెద్ద కారణమే ఉందండోయ్‌..
Interesting facts
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 30, 2022 | 10:24 AM

ఒకప్పటితో పోల్చితే ప్రస్తుతం వాటర్‌ ట్యాంకుల ఉపయోగం అనివార్యంగా మారింది. ఒకప్పుడు కేవలం బిల్డింగ్స్‌ ఉన్న వారే వాటర్‌ ట్యాంక్‌లను ఉపయోగించే వారు కానీ ప్రస్తుతం మాములు పెంకుటిల్లులు ఉన్నవారు కూడా వాటర్‌ ట్యాంక్‌లను ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే వాటర్‌ ట్యాంక్‌లను గమనిస్తే వాటిలోని నీరు వెళ్లడానికి ఒక ఇన్‌ఫ్లో, ట్యాంక్‌ నిండిన తర్వాత నీరు బయటకు రావడానికి ఒక అవుట్‌ ఫ్లో ఉంటుంది. వీటి ఉపయోగాలు మనందరికీ తెలిసిందే. అయితే వీటితో పాటు ట్యాంక్‌ పక్కన మరో పైప్‌ను ఎప్పుడైనా గమనించరా.?

‘టీ’ ఆకారంలో ఉండే ఈ పైప్‌ను కచ్చితంగా ట్యాంక్‌లకు ఏర్పాటు చేస్తారు. అయితే దీని ఉపయోగం ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా.? నిజానికి ఈ పైపు ద్వారా నీరు లోపలికి కానీ, బయటకు కానీ వెళ్లదు. అసలు నీటి కోసం దీనిని ఉపయోగించం కానీ ఈ టీ పైప్‌ను మాత్రం కచ్చితంగా అమర్చుతారు. మరి అవసరం లేనప్పుడు ఈ పైప్‌ను ఏర్పాటు చేయడం ఎందుకనేగా మీ సందేహం. అయితే దీని ఉపయోగం ఏంటో తెలిస్తో మాత్రం కచ్చితంగా ఉండాల్సిందేనని మీరు కూడా అంటారు. ఇంతకీ ఈ పైప్‌ ఉపయోగం ఏంటి.? దీనిని ఏర్పాటు చేయకపోతే వచ్చే నష్టాలు ఏంటి.? లాంటి ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

సహజంగా ఖాళీ ట్యాంకులో ఎంతో కొంత గాలి ఉంటుంది. ట్యాంక్‌లోకి నీరు నిండుతోన్న సమయంలో అప్పటికే ట్యాంక్‌లో ఉన్న గాలి బయటకు వెళ్లాల్సి ఉంటుంది. ఇందుకోసమే ఈ టీ ఆకారం పైప్‌ను ఏర్పాటు చేస్తారు. ట్యాంక్ ఎత్తు నుంచి నీరు లోపలికి పడితే ఒక్కసారిగా ట్యాంక్‌లో ప్రెషర్‌ పెరుగుతుంది. దీంతో ఈ గాలిని బయటకు పంపేందుకు టీ షేప్‌ పైప్‌ ఉపయోగపడుతుంది. ట్యాంక్‌ లోపలికి నీరు బలంగా పడే సమయంలో నీటి కంటే గాలి బరువు తేలికగా మారి ఈ పైప్‌ ద్వారా బయటకు వెళుతుంది. గాలి బయటకు వెళ్లకపోతే నష్టం ఏంటని ఆలోచిస్తున్నారు కదూ.. ఒకవేళ ఈ పైప్‌ లేకపోతే ట్యాంక్‌లో ఒత్తిడి బాగా పెరిగి ఒకానొక సమయంలో ట్యాంక్‌ పగిలిపోయే ప్రమాదం ఉంటుంది. అంతేకాకుండా ట్యాంకులో నుంచి నీటి బయటకు నీటు సరఫరా సజావుగా జరగదు. అందుకే కచ్చితంగా ట్యాంక్‌లకు టీ షేప్‌ పైప్‌ను ఏర్పాటు చేస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..