Hijab: మరో యువతిని కాల్చి చంపిన భద్రతా దళాలు.. తారా స్థాయికి చేరిన ఇరాన్‌ హిజాబ్‌ ఆందోళనలు..

ఇరాన్‌లో హిజాబ్‌ వ్యవహారం అగ్గి రాజేసింది. హిజాబ్‌ వ్యతిరేక్ ఆందోళనలతో అట్టుడుకుతోంది. హిజాబ్‌ సరిగా ధరించలేదన్న కారణంగా అరెస్టయి పోలీసులు కస్టడీలో మరణించిన మహ్సా అమిని ఉదంతం మరువకముందే హదీస్‌ నజాఫీ అనే మరో యువతిని ఇరాన్‌ భద్రతా దళాలు కాల్చి చంపాయి...

Hijab: మరో యువతిని కాల్చి చంపిన భద్రతా దళాలు.. తారా స్థాయికి చేరిన ఇరాన్‌ హిజాబ్‌ ఆందోళనలు..
Anti Hijab Protest
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 30, 2022 | 7:11 AM

ఇరాన్‌లో హిజాబ్‌ వ్యవహారం అగ్గి రాజేసింది. హిజాబ్‌ వ్యతిరేక్ ఆందోళనలతో అట్టుడుకుతోంది. హిజాబ్‌ సరిగా ధరించలేదన్న కారణంగా అరెస్టయి పోలీసులు కస్టడీలో మరణించిన మహ్సా అమిని ఉదంతం మరువకముందే హదీస్‌ నజాఫీ అనే మరో యువతిని ఇరాన్‌ భద్రతా దళాలు కాల్చి చంపాయి. హిజాబ్‌ తొలగించి ఆందోళనల్లో పాల్గొన్న నజాఫీ వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ భద్రతా దళాలు ఆమెను దారుణంగా హత్య చేశాయి. అయినప్పటికీ ఎక్కడా తగ్గకుండా ఆందోళనలను మరింత ఉధృతం చేశారు ఇరాన్‌ మహిళలు.. వీరికి అండగా వేలాది మంది యువకులు రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలుపుతున్నారు.

భద్రతాదళాలు ఆందోళనకారులతో విచక్షణా రహితంగా వ్యవహరిస్తున్నాయి. ఇరాన్‌ వ్యాప్తంగా అన్ని నగరాల్లో ఇప్పటి వరకూ జరిగిన హింసాత్మక ఘటనల్లో 76 మంది మరణించారు వీరితో ఎక్కువగా మహిళలే ఉన్నారు. కొందరు భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు.. ఇరాన్‌లో మహిళా వ్యతిరేక చట్టాలను తొలగించాలని ఆందోళనకారులు ప్రధానంగా డిమాండ్‌ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం వీరి డిమాండ్లను పట్టించుకోకుండా మరింత కఠినంగా వ్యవరిస్తోంది.

ఆందోళనలు, హింసాత్మక ఘటనల్లో పాల్గొనే వారికి తీవ్ర శిక్షలు విధిస్తామని తాజాగా హెచ్చరించారు ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ. చట్టాన్ని అతిక్రమిస్తూ అల్లర్లకు పాల్పడేవారిపట్లు కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. పౌరుల రక్షణే తమ కర్తవ్యమన్నారాయన.. హిజాబ్‌ వ్యతిరేక ఆందోళనలకు ఆజ్యం పోస్తున్నది అమెరికాయేనని ఇబ్రహీం రైసీ ఆరోపించారు. మరి ఈ వ్యవహారానికి ఎప్పుడు ఫుల్‌స్టాప్‌ పడుతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..