Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ebola: ఆఫ్రికాను హడలెత్తిస్తున్న ఎబోలా.. ఉగాండాలో 23 మంది మృతి.. అప్రమత్తమైన పొరుగు దేశాలు

ఆఫ్రికన్‌ దేశాలను ఎబోలా హడలెల్తిస్తోంది. తాజాగా ఉగాండాలో ఎబోలా కారణంగా 23 మంది ప్రాణాలు కోల్పోవడంతో పొరుగున్న ఉన్న కెన్యా అలర్ట్ అయింది. ఉగాండా, కెన్యా, డెమోక్రాటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో, బురుండి, దక్షిణ సూడాన్‌..

Ebola: ఆఫ్రికాను హడలెత్తిస్తున్న ఎబోలా.. ఉగాండాలో 23 మంది మృతి.. అప్రమత్తమైన పొరుగు దేశాలు
Viruses
Follow us
Ganesh Mudavath

|

Updated on: Sep 29, 2022 | 11:45 AM

ఆఫ్రికన్‌ దేశాలను ఎబోలా హడలెల్తిస్తోంది. తాజాగా ఉగాండాలో ఎబోలా కారణంగా 23 మంది ప్రాణాలు కోల్పోవడంతో పొరుగున్న ఉన్న కెన్యా అలర్ట్ అయింది. ఉగాండా, కెన్యా, డెమోక్రాటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో, బురుండి, దక్షిణ సూడాన్‌ దేశాల్లో ఈ వ్యాధి విజృంభిస్తోంది. కొద్ది రోజులుగా ఉగాండాలో పెద్ద సంఖ్యలో ఎబోలా కేసులు నమోదవుతున్నాయి. ముబెండే, కైగెగ్వా, కస్సాండా జిల్లాల్లో మొత్తం 36 కేసులు వెలుగు చూశాయి. ఇప్పటి వరకూ ఎబోలాతో 23 మంది మరణించారని ఉగాండా వైద్య అధికారులు ప్రకటించారు. 2019 తర్వాత ఈ దేశంలో తొలిసారిగా ఎబోలాతో మరణించారని చెబుతున్నారు. జ్వరంతో పాటు ఎబోలా ప్రాథమిక లక్షణాలైన శారీరక బలహీనత, కండరాల నొప్పి, తలనొప్పి, గొంతు నొప్పి, వాంతులు, విరేచనాలు, దద్దుర్లతో బాధపడుతున్నవారు ఇక్కడి ఆస్పత్రుల్లో పెరిగిపోతున్నారు. ఉగాండాలో ఎబోలా కేసులు పెరుగుతుండటంతో పొరుగునే ఉన్న కెన్యా అప్రమత్తమైంది. తమ దేశంలోకి ప్రవేశించేవారిని నిషితంగా పరిశీలిస్తోంది. ఉగాండాతో పాటు డెమోక్రాటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో, బురుండి, దక్షిణ సూడాన్‌ దేశాల నుంచి వచ్చేవారికి కెన్యా సరిహద్దులోని బుసియా క్రాసింగ్‌ దగ్గర ప్రత్యేక స్క్రీనింగ్‌ నిర్వహిస్తున్నారు.

అంతే కాకుండా 37.8 కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్న వారిని అక్కడే ఉన్న హోల్డింగ్ రూమ్‌కి తీసుకెళుతున్నారు. ఇప్పటి వరకూ దాదాపు 5 వేల మందిని పరిశీలించారు. అయితే ఎవరినీ ఐసోలేషన్‌కు తీసుకువెళ్లే అవసరం కలగలేదంటున్నారు. మరోవైపు ఉగాండాతో పాటు పొరుగున ఉన్న దేశాల్లో ఎబోలాపై ఆందోళన నెలకొనడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రత్యేక బృందాన్ని పంపించింది. కాగా.. గతంలోనే కాంగోలో కొత్త ఎబోలా వైర‌స్ వెలుగులోకి వ‌చ్చింది. తూర్పు నగరమైన బెనిలో ఈ కేసును నిర్ధారణ అయింది. జూలై చివరిలో బెని ఆసుపత్రిలో చేరిన 46 ఏళ్ల మ‌హిళ ఆగస్టు 15 న మ‌ర‌ణించింది. అయితే గోమాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ బయోమెడికల్ రీసెర్చ్‌లోని ల్యాబ్ సోమవారం నిర్వహించిన పరీక్షలో ఆమె మ‌ర‌ణానికి ఎబోలా జైర్ జాతి వైర‌స్ కార‌ణం అని తేలింది.

ఎబోలా వైరస్ వ్యాధిని ఎబోలా హెమరేజిక్ ఫీవర్ అని పిలిచేవారు. ఈ వైరస్ గబ్బిలాలు, పందికొక్కులు, మానవేతర ప్రైమేట్స్ వంటి అడవి జంతువుల నుంచి ప్రజలకు వ్యాపిస్తుంది. త‌రువాత ఈ వ్యాధి సోకిన వ్యక్తుల ర‌క్తం, అవయవాలు, ఇతర శారీరక ద్రవాలు, ఉపరితలాలను ప్రత్యక్షంగా తాక‌డం వ‌ల్ల ఇత‌రులకూ విస్తరిస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. సగటు EVD కేసు మరణాల రేటు దాదాపు 50 శాతం. మొదటి ఎబోలా వైరస్ వ్యాధి వ్యాప్తి 1976లో మధ్య ఆఫ్రికాలోని మారుమూల గ్రామాలలో నమోదైంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..