Nord Stream: నార్డ్ స్ట్రీమ్ గ్యాస్ పైపులైన్లలో వరుస లీకేజీలు.. పెను ముప్పు ఉందంటోన్న నిపుణులు
యూరోప్ దేశాలకు అత్యంత కీలకమైన నార్డ్ స్ట్రీమ్ పైపులైన్లలో లీకేజీలు సమస్యగా మారిపోయాయి. రష్యా నుంచి బాల్టిక్ సముద్రం మీదుగా జర్మనీకి చేరే ఈ వైపులైన్‌లో తాజా నాలుగో లీకేజీ బయటపడింది.
రష్యా నుంచి యూరోప్ దేశాలకు నేచురల్ గ్యాస్ సరఫరా చేసే నార్డ్ స్ట్రీమ్ పైపులైన్లలో వరుస లీకేజీలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా మరో లీకేజీని గుర్తించారు. యూరోప్ దేశాలకు అత్యంత కీలకమైన నార్డ్ స్ట్రీమ్ పైపులైన్లలో లీకేజీలు సమస్యగా మారిపోయాయి. రష్యా నుంచి బాల్టిక్ సముద్రం మీదుగా జర్మనీకి చేరే ఈ వైపులైన్‌లో తాజా నాలుగో లీకేజీ బయటపడింది. వీటిలో లీకేజీలు స్వీడన్ సమీపంలో ఉన్నాయి. మరో రెండు డెన్మార్క్ సమీపంలో గుర్తించారు. భారీ పేలుళ్లే లీకేజీలకు కారణమని ప్రాథమికంగా గుర్తించారు.. ఈ పేలుళ్లు రిక్టర్ స్కేలు మీద 2.3 భూకంప తీవ్రతకు సమానమని చెబుతున్నారు. . తొలి పేలుడు డెన్మార్క్‌లోని బార్న్‌హామ్ ద్వీపంలో తొలి పేలుగు జరిగిందని గుర్తించారు.. ఆ తర్వాత డెన్మార్క్, నార్వే, ఫిన్లాండ్ ప్రాంతాల్లో పేలుళ్లు నమోదయ్యాయి. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యా నుంచి యూరప్ దేశాలకు గ్యాస్ తీసుకొచ్చే నార్డ్‌స్ట్రీమ్1 మూతబడింది. నార్డ్‌స్ట్రీమ్ 2 ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు.
కాగా రష్యాపై అమెరికా, యూరోప్ దేశాలు ఆంక్షలు విధించడంతో ఆ దేశమే ప్రతీకారం తీర్చుకునేందుకు లీకేజీలు సృష్టించిందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. రష్యా ఇప్పటికే ఈ ఆరోపణలను ఖండించింది. అయితే రష్యన్ గ్యాస్‌కు ప్రత్యామ్నాయంగా నార్వే నుంచి పోలెండ్‌కు సహజవాయువును తీసుకొచ్చే పైపులైన్ ప్రారంభోత్సవం జరిగిన సమయంలోనే నార్డ్ స్ట్రీమ్ పైపులైన్లలో లీకేజీలు అనుమానాలకు తావిస్తున్నాయి.. ఉద్దేశ్యపూర్వకంగా చేసినా, నిర్లక్ష్యం కారణంగా జరిగినా ఈ లీకేజీలు పర్యావరణానికి కూడా ముప్పుగా మారాయి. సముద్రంలోని ప్రాణులకు ముప్పు పొంచి ఉందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..