AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Canada: ఇండియాలోని ఆ రాష్ట్రాలకు వెళ్లకండి.. వివాదాస్పదంగా మారిన కెనడా సూచనలు..

కెనడాలో ఇటీవల ఖలిస్థానీ వేర్పాటువాదులు ఓ హిందూ ఆలయం మీద భారత వ్యతిరేక రాతలు రాశారు. కొద్ది రోజుల క్రితం ‘సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌’ అనే సంస్థ ఖలిస్థాన్‌ ఏర్పాటును కోరుతూ రెఫరెండం నిర్వహించింది.

Canada: ఇండియాలోని ఆ రాష్ట్రాలకు వెళ్లకండి.. వివాదాస్పదంగా మారిన కెనడా సూచనలు..
Canada
Venkata Chari
|

Updated on: Sep 30, 2022 | 6:40 AM

Share

ఖలిస్థానీలకు స్వర్గధామంగా మారిందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కెనడా.. మన దేశంపై వ్యతిరేకతను మరోసారి బాహటంగా చాటుకుంది. భారత దేశ పర్యటనకు వెళ్లే తమ పౌరులకు ఆ దేశం తాజాగా కొన్ని సూచనలు చేసింది. గుజరాత్, పంజాబ్, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో పాకిస్థాన్‌ సరిహద్దు నుంచి 10 కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాల్లో పర్యటించొద్దని చెప్పుకొచ్చింది. అక్కడ మందు పాతరలు ఉండే అవకాశం ఉందని హెచ్చరించింది. అంతేకాదు ఈశాన్య భారతంలోని అస్సాం, మణిపుర్‌ రాష్ట్రాలకు అత్యవసరమైతే కానీ వెళ్లొద్దని సూచించింది. అక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు ఎక్కువగా ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని తమ పౌరులకు ట్రావెల్‌ అడ్వయిజ్‌ చేసింది.

కెనడాలో ఇటీవల ఖలిస్థానీ వేర్పాటువాదులు ఓ హిందూ ఆలయం మీద భారత వ్యతిరేక రాతలు రాశారు. కొద్ది రోజుల క్రితం ‘సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌’ అనే సంస్థ ఖలిస్థాన్‌ ఏర్పాటును కోరుతూ రెఫరెండం నిర్వహించింది. కెనడాలో భారత వ్యతిరేక శక్తులు ఆగడాలు పెరగడంపై మన విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. మత పరమైన హింస, విద్వేష కార్యకలాపాలు పెరిగిపోవడంతో అక్కడి భారతీయ పౌరులు, విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని అలర్ట్‌ చేసింది.

ఇవి కూడా చదవండి

కెనడా ప్రభత్వానికి భారత ప్రభుత్వం తన నిరసనను కూడా తెలియజేసింది. దీన్ని దృష్టిలో పెట్టుకొనే ప్రతీకార చర్యగా తమ పౌరులకు కెనడా ఇలాంటి హెచ్చరికలు జారీ చేసిందని భావిస్తున్నారు. కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో ఖలిస్థానీలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇలాంటి తీర్పు ఇచ్చిందని భావిస్తున్నారు.