Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారతీయుల వెయిటింగ్ టైం 2 ఏళ్లు.. చైనీస్‌కు మాత్రం 2 రోజులే.. అమెరికా వీసా అపాయింట్మెంట్‌పై పెల్లుబికిన ఆగ్రహం..

అమెరికా వీసా అపాయింట్మెంట్‌ కోసం ఇండియన్స్‌ రెండేళ్లకు పైగా ఎదురు చూస్తే, చైనీస్‌కు మాత్రం రెండు రోజుల్లో వస్తోంది. ఇదేం అన్యాయమని భారతీయులు ప్రశ్నిస్తున్నారు.

భారతీయుల వెయిటింగ్ టైం 2 ఏళ్లు.. చైనీస్‌కు మాత్రం 2 రోజులే.. అమెరికా వీసా అపాయింట్మెంట్‌పై పెల్లుబికిన ఆగ్రహం..
America Visa
Follow us
Venkata Chari

|

Updated on: Sep 30, 2022 | 6:45 AM

భారత్‌ నుంచి అమెరికాకు వెళ్లాలనుకునే వారికి ఇటీవలి కాలంలో కష్టాలు వచ్చి పడ్డాయి. పర్యాటక వీసా అపాయింట్మెంట్‌ కోసం దరఖాస్తు చేసుకునే వారికి వెయింటింగ్‌ సమయం 833 రోజులకు చూపిస్తోంది. కానీ, చైనీస్‌కు మాత్రం రెండు రోజుల్లోనే అపాయింట్మెంట్‌ దొరుకుతోంది. పాకిస్తానీయులకైతే 450 రోజుల వెయిటింగ్‌ చూపిస్తోంది. అలాగే భారతీయు విద్యార్థులు అమెరికా వెళ్లి చదువుకునేందుకు వీసా కోసం అప్లయ్‌ చేస్తే 430 రోజులు చూపిస్తోంది. భారతీయులు వీసా అపాయింట్మెంట్ల కోసం ఏళ్ల తరబడి ఎదురు చూడాల్సిన రావడం విమర్శలకు దారి తీస్తోంది.

కరోనా సంక్షోభం తర్వాత వీసా దరఖాస్తు దారులు పెరిగినా సిబ్బంది కొరత పేరుతో అమెరికా అధికారులు జాప్యం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న భారత విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ వీసా సమస్యలపై అమెరికా విదేశాంగ శాఖ మంత్రి బ్లింకన్‌తో చర్చించారు. త్వరలో ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని బ్లింకెన్‌ హామీ కూడా ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

మరోవైపు గ్రీన్​కార్డులకు సంబంధించిన కీలక బిల్లును అమెరికా కాంగ్రెస్​లో ప్రవేశపెట్టారు. వలసదారులు కనీసం ఏడు సంవత్సరాలు అమెరికాలో నివసిస్తే.. గ్రీన్‌కార్డు జారీ చేయాలని ఈ బిల్లులో ప్రతిపాదించారు. ఇప్పటి వరకూ హెచ్‌ 1బీ వీసాలపై వచ్చిన వారు గ్రీన్‌కార్డు కోసం ఏళ్ల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఉండేది. ఈ బిల్లు ఆమోదం పొందితే భారతీయులకు భారీ ఊరట లభించనుంది. పాత ఇమిగ్రేషన్ విధానంతో వలసదారులు చాలా నష్టపోయారు. మరోవైపు అమెరికా ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతింటోంది.