AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kenya Drought: కెన్యాలో తీవ్ర కరువు.. ఆకలితో వన్యప్రాణుల మృత్యవాత..

ఆకలి మనుషులనే కాదు.. వన్య ప్రాణులనూ చంపేస్తోంది. కెన్యాలో దారుణ కరువుతో ఏనుగులు, జీబ్రాలు పెద్ద సంఖ్యలో మృత్యవాత పడుతున్నాయి.

Kenya Drought: కెన్యాలో తీవ్ర కరువు.. ఆకలితో వన్యప్రాణుల మృత్యవాత..
Kenya Drought
Venkata Chari
|

Updated on: Sep 30, 2022 | 7:20 AM

Share

గత నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతటి దుర్భిక్షం ఇది. ఆఫ్రికా కొమ్ము ప్రాంతంగా పలిచే కెన్యా, సోమాలియా, ఇథియోపియా దేశాల్లో నాలుగేళ్ల నుంచి వర్షాలు లేవు. వరుసగా ప్రతీ వానా కాలం నిరాశే ఎదురువుతోంది. వర్షాలు లేక జలాశయాలు ఎండిపోయాయి. నదులు కూడా అడుగంటిపోయాయి. పంటలు పండించే పరిస్థితులు లేవు. ఈ దేశాల్లో లక్షలాదిమంది ప్రజలు ఆకలితో అల్లాడిపోతున్నారు. కెన్యాలో అయితే పరిస్థితి మరీ దారుణంగా మారింది. మనుషులకే తిండి దొరకని పరిస్థితుల్లో మూగజీవాల పరిస్థితిని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మేకలు, ఆవులు, గేదెలు గడ్డీ గాదం దొరకక మృత్యువాత పడుతున్నాయి. చివరకు అడవుల్లోని వన్యప్రాణులకూ ఆకలి బాధలు తప్పడం లేదు. నంబురు అభయారణ్యంలో తినేందుకు గ్రాసం దొరకక, తాగేందుకు నీళ్లు లేక పెద్ద సంఖ్యలో జంతువులు ప్రాణాలు విడిచేస్తున్నాయి.

కెన్యాలో కనిపించే అరుదైన గ్రేవీస్ జీబ్రాల శవాలు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నాయి. ప్రపంచం వ్యాప్తంగా 3 వేల జీబ్రాలు ఉంటే, ఒక్క కెన్యాలోనే 2,500 ఉంటాయి. గత జూన్‌ నుంచి ఇప్పటి వరకూ 40 జీబ్రాలు చనిపోయాయి. మరోవైపు ఏనుగులు మరణ శాతం 25 రెట్లు పెరిగింది. ఇప్పటి వరకూ 50 ఏనుగులు చనిపోయినట్లు గుర్తించారు.

ఇవి కూడా చదవండి

ఎక్కడ చూసినా వన్యప్రాణుల శవాలను పీక్కుతింటున్న రాబందులే కనిపిస్తున్నాయి. కుళ్ళిన కళేబరాల దుర్వాసన భరించలేనంతగా ఉంది. నవంబర్‌లో వర్షాలు పడకుంటే మున్ముందు మరిన్ని గడ్డురోజులు ఉంటాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వన్యప్రాణులను కాపాడుకునేందుకు అటవీ సిబ్బంది ఎంతో కష్టపడుతున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..