Mexico: అంత్యక్రియలకు వెళ్లి భార్యతో ఇదేం పని.. నేటిజన్లు ఆట ఆడుకున్నారు..(వీడియో)
మెక్సీకో విదేశాంగ మంత్రి మార్సెలో ఇబ్రార్డ్‌ను నేటిజన్లు ఆట ఆడుకున్నారు. రాణి ఎలిజబెత్ అంత్యక్రియలకు వెళ్లిన ఆయన.. భార్యతో కలిసి సెల్ఫీకి పోజులివ్వడంపై మండిపడ్డారు. దేశం తరఫున ప్రతినిధిగా వెళ్లి రాణి
మెక్సీకో విదేశాంగ మంత్రి మార్సెలో ఇబ్రార్డ్‌ను నేటిజన్లు ఆట ఆడుకున్నారు. రాణి ఎలిజబెత్ అంత్యక్రియలకు వెళ్లిన ఆయన.. భార్యతో కలిసి సెల్ఫీకి పోజులివ్వడంపై మండిపడ్డారు. దేశం తరఫున ప్రతినిధిగా వెళ్లి రాణి అంత్యక్రియల్లో ఇంత అమర్యాదగా ప్రవర్తిస్తారా? అని విమర్శలు గుప్పించారు.’మీరు భార్యతో కలిసి సెల్ఫీలు తీసుకోవడానికి అదేం బర్త్‌డే పార్టీ కాదు. మెక్సీకో ప్రతినిధిగా వెళ్లారు. అది గుర్తుపెట్టుకోండి’ అని ఓ నెటిజన్ ఇబ్రార్డ్‌కు చురకలు అంటించాడు.బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 అంత్యక్రియలు సెప్టెంబర్ 17న జరిగాయి. 2,000 మంది విదేశీ ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అందులో ఇబ్రార్డ్ ఒకరు. అయితే అంత్యక్రియలకు ముందు ఆయన భార్యతో కలిసి దిగిన సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఇరకాటంలో పడ్డారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Nayanthara properties: నయనతారకు అన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా ? ఏకంగా హైదరాబాద్‍లోనే..
Pizza: మార్కెట్‌లో కొత్తరకం పిజ్జా.. అమ్మబాబోయ్.. దీన్ని పిజ్జా అంటారా.. వీడియో చూస్తే..