లాకర్లో బంగారం మాయం.. బ్యాంక్ మేనేజర్ చేతివాటం
బెంగళూరులోని గిరినగర్ బ్యాంక్ బ్రాంచ్‌లో షాకింగ్ గోల్డ్ లోన్ మోసం వెలుగులోకి వచ్చింది. అసిస్టెంట్ మేనేజర్ కిరణ్ కుమార్ ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బానిసై, కస్టమర్లు తాకట్టు పెట్టిన 2.7 కిలోల బంగారాన్ని దొంగిలించి, ఇతర చోట్ల తాకట్టు పెట్టి ₹3.5 కోట్లు కాజేశాడు. కస్టమర్ ఫిర్యాదుతో మోసం బయటపడగా, నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన బ్యాంకింగ్ వ్యవస్థలో భద్రతా లోపాలను ఎత్తిచూపుతోంది.
బ్యాంకుల్లో డబ్బులు నగలు భద్రంగా ఉంటాయని నమ్మే సామాన్యులకు షాకింగ్ వార్త ఇది. ఓ బ్యాంక్ డిప్యూటీ మేనేజర్, కస్టమర్లు లోన్ కోసం పెట్టిన బంగారాన్ని దొంగతనంగా వాడుకుని ఏకంగా 3.5 కోట్ల రూపాయల మోసానికి తెరలేపాడు. బెంగళూరులోని గిరినగర్ బ్రాంచ్‌లో షాకింగ్ ఘటన జరిగింది. బ్రాంచ్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా కిరణ్ కుమార్ పనిచేస్తున్నాడు. పోలీసుల సమాచారం ప్రకారం కిరణ్ కుమార్ కొంతకాలంగా ఆన్‌లైన్ బెట్టింగ్‌కి బానిసయ్యాడు. తన వ్యసనాల కోసం డబ్బు అవసరమవ్వడంతో బ్యాంకు లాకర్లపై తనకున్న అధికారాన్ని దుర్వినియోగం చేశాడు. కస్టమర్లు గోల్డ్ లోన్ కోసం బ్యాంకులో ఉంచిన బంగారు ఆభరణాలను మెల్లమెల్లగా బయటకు తీసి, ఇతర ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల్లో తాకట్టు పెట్టి డబ్బు తీసుకున్నాడు. ఆ గుట్టు ఎలా రట్టు అయిందంటే ఒక మహిళా కస్టమర్ తన గోల్డ్ లోన్ చెల్లించి, తాకట్టు పెట్టిన నగలను తిరిగి తీసుకోవడానికి బ్యాంకుకు వచ్చింది. ఆమెకు ఇచ్చిన ప్యాకెట్‌ను తెరిచి చూడగా, అందులో ఉండాల్సిన నగలు మాయమయ్యాయి. దీనిపై ఆమె అధికారులను నిలదీయడంతో అసలు విషయం బయటపడింది. వెంటనే అలర్ట్ అయిన బ్యాంక్ మేనేజ్‌మెంట్ ఇంటర్నల్ చెకింగ్ నిర్వహించారు. 3.5 కోట్ల రూపాయలు విలువ చేసే 2.7 కిలోల బంగారం మాయమైనట్లు తెలిసింది. మొత్తం 24 ప్యాకెట్లలో బంగారం మాయమవ్వగా, అందులో 21 ప్యాకెట్లు కొంత వరకు, 3 ప్యాకెట్లు పూర్తిగా ఖాళీ అయ్యాయి. బ్యాంక్ చీఫ్ మేనేజర్ ఫిర్యాదుతో గిరినగర్ పోలీసులు కిరణ్ కుమార్‌ను అరెస్ట్ చేశారు. నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. ఇప్పటివరకు పోలీసులు 1.2 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన బంగారాన్ని రికవరీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటన బ్యాంకింగ్ వ్యవస్థలో భద్రతా లోపాలను ఎత్తిచూపుతోంది. బ్యాంకులు ఆడిటింగ్ ను మరింత కఠినతరం చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గోత్రం చూసి ఏడు తరాల సమాచారాన్ని.. చెప్పేస్తారు.. ఎక్కడంటే..
బాత్‌రోబ్‌లో కాలేజీకి.. ఐ డోంట్ కేర్ అంటూ సందేశం.. అమెరికాలో శవమైన విద్యార్థి సాకేత్
నా బిడ్డను అత్యాచారం చేసి చంపారు..సాక్ష్యాలు ఉన్నాయి
సారీ బన్నీ.. అల్లు అర్జున్ కు ఆ ఇద్దరు క్షమాపణలు
CM Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ చేసిన వ్యక్తి తెలంగాణ జాతి పిత ఎలా అవుతారు
లాకర్లో బంగారం మాయం.. బ్యాంక్ మేనేజర్ చేతివాటం
గోత్రం చూసి ఏడు తరాల సమాచారాన్ని.. చెప్పేస్తారు.. ఎక్కడంటే..
శివరాత్రి వేళ స్మశానంలో మంత్రి.. ఏంచేశారో తెలుసా ??
లక్ష్మణుడు లేని అరుదైన శ్రీరామ ఆలయం.. ఎక్కడ ఉందో తెలుసా
అభ్యర్ధుల ఓటమితో.. కసితో దాడి! గిఫ్ట్‌లు తిరిగి ఇచ్చేసిన ఓటర్లు
రాత్రి గుడారాల్లో.. పగలు కార్లలో.. ఐడియా అదిరింది
ఇసుకతో ప్రాణం పోశారు !! ఈ శిల్పాన్ని చూస్తే కళ్ళు తిప్పుకోలేరు !!

