బాత్‌రోబ్‌లో కాలేజీకి.. ఐ డోంట్ కేర్ అంటూ సందేశం.. అమెరికాలో శవమైన విద్యార్థి సాకేత్
అమెరికాలోని బర్క్‌లీలో ఐఐటీ విద్యార్థి సాకేత్ శ్రీనివాసయ్య మృతి విషాదం నింపింది. మేధావి, యువ శాస్త్రవేత్త అయిన సాకేత్, తీవ్ర డిప్రెషన్‌తో బాధపడినట్లు స్నేహితులు వెల్లడించారు. లేక్ అంజా వద్ద మృతదేహం లభ్యం కావడం, మానసిక వేదనకు సంబంధించిన సూచనలు అతని సహచరులు గుర్తించడం గమనార్హం. భారత దౌత్య కార్యాలయం మృతదేహాన్ని స్వదేశానికి తరలించే ఏర్పాట్లు చేస్తోంది.
అమెరికాలో కనిపించకుండా పోయిన 22 ఏళ్ల కర్నాటక విద్యార్థి సాకేత్ శ్రీనివాసయ్య మృతిచెందినట్లు శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఇండియన్ ఎంబసీ ప్రకటించింది. సాకేత్ కనిపించట్లేదని అతడి స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాలేజ్ క్యాంపస్‌కు సమీపంలోని లేక్ అంజా వద్ద అతడ్ని చివరిసారిగా చూసిన వాళ్లు పోలీసులకు చెప్పడంతో వారు ఆ పరిసరాల్లో గాలించారు. సాకేత్ మృతదేహంతో పాటు అతడి బ్యాగ్, ల్యాప్‌టాప్, పాస్‌పోర్ట్‌ను గుర్తించారు. అతనో ఐఐటీయన్.. పేటెంట్ హక్కు పొందిన యువ శాస్త్రవేత్త.. కానీ అపారమైన మేధస్సు వెనుక డిప్రెషన్. రెండు వారాలు కేవలం బిస్కెట్లు, చిప్స్ తింటూ.. బాత్‌రోబ్ వేసుకుని క్లాసులకు వెళ్లాడు. తనలోని మానసిక వేదనను పరోక్షంగా బయటపెట్టాడు. చివరకు విగతజీవిగా తేలాడు 22 ఏళ్ల సాకేత్ శ్రీనివాసయ్య. అమెరికాలోని ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో జరిగిన ఈ విషాదం వెనుక షాకింగ్ నిజాలను అతడి స్నేహితుడే సోషల్ మీడియా వేదికగా బయటపెట్టాడు. అయితే సాకేత్ ఎప్పుడూ ఒత్తిడికి లోనైనట్లు కనిపించలేదనీ సాకేత్ రూంమేట్ బనీత్‌సింగ్ పోస్ట్ ద్వారా తెలిపాడు. సాకేత్ ఆత్మహత్య చేసున్నట్లుగా తను కూడా భావిస్తున్నానన్నాడు. కనిపించకుండా పోయిన రోజు కాలేజ్‌కు నైట్‌డ్రెస్‌లో వెళుతుంటే ఆశ్చర్యం వేసి అడిగాననీ పోస్ట్‌లో రాసుకొచ్చాడు. తనమీద తనకు ఇంట్రెస్ట్ పోయిందని చెప్పాడనీ అప్పట్లో తాను దానిని జోక్ అనుకున్నానని బనీత్ వాపోయాడు. జనవరి 21న తనను ‘లేక్ అంజా’కు రావాలని సాకేత్ ఆహ్వానించాడని.. కానీ తాను బద్ధకించి వెళ్లలేదని, అదే చోట సాకేత్ ప్రాణాలు తీసుకుంటాడని ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. రెండు వారాలుగా అన్నం తినడం మానేసి చిప్స్, కుకీస్ మాత్రమే తింటుండేవాడని తెలిపాడు. సాకేత్ మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వదేశానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని భారత దౌత్య కార్యాలయం తెలిపింది. ఐఐటీ మద్రాస్‌లో బీటెక్ పూర్తి చేసిన సాకేత్ బర్క్‌లీలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా క్యాంపస్‌లో కెమికల్ అండ్ బయో మాలిక్యులర్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ కోసం చేరాడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నా బిడ్డను అత్యాచారం చేసి చంపారు..సాక్ష్యాలు ఉన్నాయి
సారీ బన్నీ.. అల్లు అర్జున్ కు ఆ ఇద్దరు క్షమాపణలు
CM Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ చేసిన వ్యక్తి తెలంగాణ జాతి పిత ఎలా అవుతారు
KTR: కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తామన్నారు.. కానీ తెలంగాణయే కేసీఆర్ ఆనవాళ్లు
శివరాత్రి వేళ స్మశానంలో మంత్రి.. ఏంచేశారో తెలుసా ??
లక్ష్మణుడు లేని అరుదైన శ్రీరామ ఆలయం.. ఎక్కడ ఉందో తెలుసా
అభ్యర్ధుల ఓటమితో.. కసితో దాడి! గిఫ్ట్‌లు తిరిగి ఇచ్చేసిన ఓటర్లు
రాత్రి గుడారాల్లో.. పగలు కార్లలో.. ఐడియా అదిరింది
ఇసుకతో ప్రాణం పోశారు !! ఈ శిల్పాన్ని చూస్తే కళ్ళు తిప్పుకోలేరు !!
పైకి మాత్రం కుటీర పరిశ్రమ.. లోపలే ఉంది అసలు రహస్యం
జూ పార్క్‌లో హిప్పోల బర్త్ డే సెలబ్రేషన్స్

