India vs South Africa: సఫారీలతో టీ20 సిరీస్.. బుమ్రా స్థానంలో హైదరాబాదీ స్టార్ పేసర్.. టీ20 ప్రపంచకప్‌కు కూడా!
దక్షిణా ఫ్రికాతో మొదటి టీ20 మ్యాచ్‌కు ముందు బుమ్రాకు పరీక్షలు నిర్వహించారు. అతని వెన్నులో ఫ్రాక్చర్ అయినట్లు తేలింది. దీనికి ఎలాంటి సర్జరీ అవసరం లేకపోయినప్పటికీ సుమారు 4-6 నెలల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది.
టీమిండియా స్టార్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రాకు మళ్లీ గాయం తిరగబెట్టింది. దీంతో అతను ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్‌లో ఆడే అవకాశాలు దాదాపు లేనట్లే. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌కు బుమ్రా స్థానంలో హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్‌ను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. కాగా దక్షిణా ఫ్రికాతో మొదటి టీ20 మ్యాచ్‌కు ముందు బుమ్రాకు పరీక్షలు నిర్వహించారు. అతని వెన్నులో ఫ్రాక్చర్ అయినట్లు తేలింది. దీనికి ఎలాంటి సర్జరీ అవసరం లేకపోయినప్పటికీ సుమారు 4-6 నెలల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. ఈ కారణంతోనే బుమ్రా గౌహతికి కూడా వెళ్లలేదని సమాచారం.
కాగా బీసీసీఐ మెడికల్ బృందం ఆధ్వర్యంలో వెన్నునొప్పికి చికిత్స తీసుకుంటున్నాడు బుమ్రా. అతను వరల్డ్‌కప్‌లో ఆడతాడా?లేదా? అన్నది బీసీసీఐ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఒక వేళ బుమ్రా దూరమైతే భారత జట్టుకు మరో బౌలర్ కావాల్సి ఉంది. ఇప్పటికే కరోనా నుంచి నుంచి కోలుకున్న షమీ స్టాండ్‌బై లిస్ట్‌లో ఉన్నా ఫిట్‌నెస్ టెస్టులో పాస్ అయితేనే అతను ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కనున్నాడు. ఈ నేపథ్యంలో సఫారీలతో సిరాజ్ సత్తా చాటితే ప్రపంచకప్ బెర్తు దక్కవచ్చని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సిరాజ్ బౌలింగ్‌లో పేస్, స్వింగ్ ఉంటుందని, ఆసీస్ పిచ్‌లు అతనికి సరిగ్గా సరిపోతాయంటున్నారు.
ఆస్ట్రేలియా విమానం ఎక్కితే..
ఇదిలా ఉంటే ఆస్ట్రేలియా గడ్డపైనే సిరాజ్ అంతర్జాతీయ టెస్ట్‌లోకి అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్‌లోనే 5 వికెట్లతో సత్తా చాటాడు. ఒకవేళ సిరాజ్ ఆస్ట్రేలియా విమానం ఎక్కితే అది నిజంగా చరిత్రే. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రపంచకప్ ఆడిన క్రికెటర్‌గా సిరాజ్ చరిత్రకెక్కనున్నాడు. దిగ్గజ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్, అంబటి రాయుడు కూడా ఈ ఘనత అందుకోలేకపోయారు.
Mohammad Siraj in the mix-up to replace Jasprit Bumrah in the T20 World Cup squad. (Reported by Sports Tak).