Sachin: బ్రెట్‌లీ బౌలింగ్ లో ట్రేడ్‌ మార్క్‌ కవర్‌ డ్రైవ్‌.. సచిన్‌ షాట్‌ను చూసేందుకు రెండు కళ్లు చాలవంతే

మాస్టర్ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ ఆడే కవర్‌ డ్రైవ్‌లకు ఎంతో మంది ఫ్యాన్స్‌ ఉన్నారు. షోయబ్‌ అక్తర్‌, బ్రెట్‌లీ, మెక్‌గ్రాత్‌ లాంటి భీకరమైన బౌలర్ల బౌలింగ్‌లోనూ సచిన్‌ ఈ షాట్‌ ఆడేవాడు.

Sachin: బ్రెట్‌లీ బౌలింగ్ లో ట్రేడ్‌ మార్క్‌ కవర్‌ డ్రైవ్‌.. సచిన్‌ షాట్‌ను చూసేందుకు రెండు కళ్లు చాలవంతే
Sachin Tendulkar
Follow us

|

Updated on: Sep 30, 2022 | 10:42 AM

క్రికెట్‌లో కొన్ని షాట్లు కొందరికే రాసి పెట్టుంటాయి. వారి బ్యాట్‌ నుంచి జాలువారితేనే వాటికి అందం. సచిన్‌ కవర్‌ డ్రైవ్‌.. గంగూలీ ఆఫ్‌సైడ్‌ డ్రైవ్‌.. ధోని హెలికాప్టర్‌ షాట్‌.. ఇలా మ్యాచ్‌లో వీరి షాట్లు కళ్లకు ఎంతో ఇంపుగా అనిపిస్తాయి. అభిమానులకు కేరింతలు తెప్పి్స్తాయి. ముఖ్యంగా మాస్టర్ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ ఆడే కవర్‌ డ్రైవ్‌లకు ఎంతో మంది ఫ్యాన్స్‌ ఉన్నారు. షోయబ్‌ అక్తర్‌, బ్రెట్‌లీ, మెక్‌గ్రాత్‌ లాంటి భీకరమైన బౌలర్ల బౌలింగ్‌లోనూ సచిన్‌ ఈ షాట్‌ ఆడేవాడు. అయితే సచిన్‌ క్రికెట్‌ నుంచి రిటైర్‌ అయ్యిన తర్వాత ఇలాంటి ట్రేడ్‌మార్క్‌ షాట్లు చూడలేకపోయాం. అయితే రోడ్‌సేఫ్టీ వరల్డ్‌ సిరీస్ పుణ్యమా అని మళ్లీ పాత రోజులను గుర్తుకు తెస్తున్నాడు టెండూల్కర్‌. తనకు మాత్రమే సాధ్యమయ్యే షాట్లతో అభిమానులను అలరిస్తున్నాడు.

బ్రెట్‌లీ బౌలింగ్‌లో మొన్నటికి మొన్న ఫ్రంట్‌ఫుట్‌ వచ్చి లాంగాన్‌ మీదుగా లాఫ్టెట్‌ షాడ్‌ ఆడి బంతిని సిక్సర్‌గా మలిచాడు. తద్వారా వింటేజ్‌ సచిన్‌ను మళ్లీ గుర్తుకు తెచ్చాడు. తాజాగా గురువారం ఆస్ట్రేలియా లెజెండ్స్‌తో జరిగిన సెమీఫైనల్‌ మ్యాచ్‌లో మరో ఆణిముత్యం లాంటి షాట్‌ ఆడాడు. ఆస్ట్రేలియా స్పీడ్‌స్టర్‌ బ్రెట్‌ లీ బౌలింగ్‌లో ఎక్స్‌ట్రా కవర్స్‌ మీదుగా బౌండరీ కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన అభిమానులు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. దశాబ్ధంన్నర క్రితం ఇలాంటి షాట్లు చూశాం.. మళ్లీ ఇప్పుడు, మా కళ్లు ఎంత పుణ్యం చేసుకున్నాయో అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇక మ్యాచ్‌ విషయానికొస్తే.. గురువారం జరిగిన సెమీఫైన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా లెజెండ్స్‌పై టీమిండియా లెజెండ్స్‌ ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా లెజెండ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన ఇండియా లెజెండ్స్‌ 4 బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. నమన్‌ ఓజా(90 నాటౌట్‌), ఇర్ఫాన్‌ పఠాన్‌(37 నాటౌట్‌) జట్టును ఫైనల్‌కు చేర్చారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..