Srivari Brahmotsavam: గ‌రుడ‌సేవ‌కు టీటీడీ భారీ ఏర్పాట్లు.. భక్తుల కోసం హెల్ప్ డెస్క్‌లు.. పిల్లలకు చైల్డ్ ట్యాగ్‌లు..

గ్యాల‌రీల్లో ఉద‌యం 6 నుంచి రాత్రి 12 గంట‌ల వ‌ర‌కు అన్నప్రసాదాలు, తాగునీరు అందిస్తారు. భ‌క్తుల‌కు సౌకర్యవంతంగా ఉండేలా గ్యాల‌రీల‌కు అనుసంధానంగా తాత్కాలిక మ‌రుగుదొడ్లు ఏర్పాటుచేశారు.

Srivari Brahmotsavam: గ‌రుడ‌సేవ‌కు టీటీడీ భారీ ఏర్పాట్లు.. భక్తుల కోసం హెల్ప్ డెస్క్‌లు.. పిల్లలకు చైల్డ్ ట్యాగ్‌లు..
Tirumala
Follow us
Venkata Chari

| Edited By: Janardhan Veluru

Updated on: Oct 01, 2022 | 10:40 AM

శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా అక్టోబర్ 1న జ‌ర‌గ‌నున్న గరుడసేవకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేప‌ట్టింది. దాదాపు మూడు లక్షల మంది భక్తులకు శ్రీ‌వారి గ‌రుడ వాహ‌నసేవ‌ దర్శనం చేయించేందుకు చ‌ర్యలు చేప‌ట్టింది. గ్యాల‌రీల్లో ఉద‌యం 6 నుంచి రాత్రి 12 గంట‌ల వ‌ర‌కు అన్నప్రసాదాలు, తాగునీరు అందిస్తారు. అన్నప్రసాద భ‌వ‌నంలో రాత్రి ఒంటి గంట వ‌రకు అన్నప్రసాదాలు అంద‌జేయనున్నారు. భ‌క్తుల‌కు సౌకర్యవంతంగా ఉండేలా గ్యాల‌రీల‌కు అనుసంధానంగా తాత్కాలిక మ‌రుగుదొడ్లు ఏర్పాటుచేశారు. అద‌న‌పు సిబ్బందితో మెరుగైన పారిశుద్ధ్య చ‌ర్యలు చేప‌ట్టారు.

టప్పర్‌వేర్ బాటిళ్లు వాడండి..

గ్యాల‌రీల్లో వేచి ఉండే భ‌క్తుల కోసం సుర‌క్షిత తాగునీటిని టీటీడీ అందుబాటులో ఉంచింది. భ‌క్తుల‌కు గ్లాసుల ద్వారా నీటిని అందిస్తారు. భ‌క్తులు తాగునీటిని త‌మ‌వద్ద ఉంచుకోవాల‌నుకుంటే టప్పర్‌వేర్ బాటిళ్లు గానీ, స్లీట్ లేదా రాగి సీసాలు గానీ వినియోగించాల‌ని టీటీడీ కోరుతోంది.

ఇవి కూడా చదవండి

హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు..

గ‌రుడ సేవ సంద‌ర్భంగా భ‌క్తుల‌కు కావాల్సిన స‌మాచారాన్ని అందించేందుకు ఏడు ప్రాంతాల్లో హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేశారు. జీఎన్‌సీ టోల్‌గేట్‌, సీఆర్వో, బాలాజీ బ‌స్టాండ్‌, రాంభ‌గీచా విశ్రాంతి గృహాలు, రాగిమాను సెంట‌ర్‌, ఏటీసీ స‌ర్కిల్‌, బేడి ఆంజ‌నేయ‌స్వామివారి ఆల‌యం వ‌ద్ద హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేశారు.

కామ‌న్ క‌మాండ్ సెంట‌ర్‌..

పీఏసీ-4లో ఏర్పాటు చేసిన కామ‌న్ క‌మాండ్ సెంట‌ర్‌లో భ‌క్తులు ఫోన్ ద్వారా అడిగే సందేహాల‌ను నివృత్తి చేస్తారు. ఇందుకోసం టోల్ ఫ్రీ నంబ‌రు 1800425111111 అందుబాటులో ఉంచారు. భ‌క్తులు సులువుగా మాడ వీధుల్లోని గ్యాల‌రీల్లోకి ప్రవేశించేందుకు వీలుగా సైన్‌బోర్డులు ఏర్పాటుచేశారు. వీటిలో ప్రవేశ, నిష్క్రమణ గేట్ల వివ‌రాల‌ను అందుబాటులో ఉంచారు.

చైల్డ్ ట్యాగ్‌లు..

టీటీడీ భ‌ద్రతా విభాగం, పోలీసు విభాగం ఆధ్వర్యంలో పిల్లలకు చైల్డ్ ట్యాగ్‌లు క‌డుతున్నారు. ర‌ద్దీ స‌మ‌యంలో త‌ల్లిదండ్రుల నుంచి పిల్లలు త‌ప్పిపోతే ఈ ట్యాగ్‌ల సాయంతో గుర్తించే అవ‌కాశ‌ముంది.

ఆర్టీసీ ప్రత్యేక సేవలు..

తిరుమల శ్రీవారి గరుడసేవకు భక్తులకు సేవలందించేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు నిర్వహించే గరుడ సేవను తిలకించేందుకు నిమిషానికి రెండు ఆర్టీసీ సర్వీసులను అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేసింది. ఎలక్ట్రిక్ బస్సులతో కలిపి తిరుమల ఘాట్ రోడ్‌లో 5044 ట్రిప్పులతో 2 లక్షల మంది భక్తుల రాకపోకల టార్గెట్‌గా ఆర్టీసీ సిద్ధమయింది. ఈ మేరకు తిరుపతిలో 13 చోట్ల టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేసింది.

గ‌రుడ‌సేవ‌కు ద్విచక్ర వాహనాలకు నో ఎంట్రీ..

శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా అక్టోబ‌రు 1న శ‌నివారం గ‌రుడ సేవ సంద‌ర్భంగా కొండమీదకు ద్విచక్ర వాహనాలకు అనుమ‌తి లేదని టీటీడీ పేర్కొంది. భ‌క్తుల భ‌ద్రత దృష్ట్యా ఈరోజు మ‌ధ్యాహ్నం 12 గంట‌ల నుంచి అక్టోబ‌రు 2వ తేదీ మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు తిరుమ‌ల ఘాట్ రోడ్లలో ద్విచ‌క్ర వాహ‌నాల‌ను అనుమతి లేదు.

నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ