తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు
శ్లోకం
కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్
తాత్పర్యం: కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా! తూర్పు తెల్లవారుచున్నది. దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది. కావున లెమ్ము.
కథనాలు
వీడియోలు
వెబ్ స్టోరీస్
మరిన్నిఫొటో గ్యాలరీ
వార్తలు
తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతి యేటా బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో దేశ, విదేశాలకు చెందిన శ్రీవారి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లపై తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) అధికారులు రెండు నెలల మునుపటి నుంచే దృష్టిసారించారు.
ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. 9 రోజులు నిర్వహించే బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతి రోజూ ఉదయం 8 గంటలకు, సాయంత్రం 7 గంటలకు స్వామివారికి వాహన సేవలు నిర్వహిస్తారు. వాహన సేవల్లో అత్యంత కీలకమైన గరుడ సేవలో శ్రీవారి భక్తులు లక్షల సంఖ్యలో పాల్గొంటారు. చక్రస్నానం తర్వాత నిర్వహించే ధ్వజావరోహణ ఘట్టంతో బ్రహ్మోత్సవాలు పూర్తవుతాయి.
తిరుమల వార్షిక బ్రహ్మోత్సవాలకు సంబంధించిన కీలక ప్రశ్నలు, సమాధానాలు
-
ప్రశ్న: తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను ఎన్ని రోజులు నిర్వహిస్తారు?జవాబు: – శ్రీవారి బ్రహ్మోత్సవాలను తొమ్మిది రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తారు.
-
ప్రశ్న: శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఎవరు మొదలుపెట్టినట్లు మన పురాణాల్లో పేర్కొనబడింది?జవాబు:– తిరుమల వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలను సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే మొదలుపెట్టినట్లు చెప్పబడింది.
-
ప్రశ్న: తిరుమల శ్రీవారికి ఏడాదికి రెండుసార్లు బ్రహ్మోత్సవాలు ఎప్పుడు నిర్వహిస్తారు?జవాబు:– సాధారణంగా తిరుమల మలయప్పస్వామి వారి బ్రహ్మోత్సవాలను ఏడాదికి ఒకసారే నిర్వహిస్తారు. అయితే ఏడాదికి అధిక మాసం వస్తే మాత్రం రెండుసార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. అధికమాసం లేనప్పుడు ఒకసారి మాత్రమే బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.
-
ప్రశ్న: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించే వాహన సేవల్లో అత్యంత కీలకమైనది ఏది?జవాబు:– తిరుమల స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించే వాహన సేవల్లో గరుణ సేవకు అత్యంత కీలకమైన వాహనసేవగా పరిగణిస్తారు.
-
ప్రశ్న: లడ్డూ ప్రసాదంను భక్తులకు అందించే విషయంలో ఇటీవల టీటీడీ తీసుకున్న కీలక నిర్ణయం ఏంటి?జవాబు: – స్వామి వారి దర్శన టికెట్లు కలిగిన భక్తులు 4 నుంచి 6 లడ్డూలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. దర్శనం టికెట్ లేని భక్తులు తమ ఆధార్ కార్డును చూపించి గరిష్ఠంగా రెండు లడ్డూలు మాత్రమే కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.