AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తిరుమల బ్రహ్మోత్సవాలు.. కాసేపట్లో సర్వభూపాల వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్న స్వామివారు

Tirumala Srivari Bahmotsavam 2025: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. శనివారం ఉదయం శ్రీమలయప్ప స్వామివారు.. ఉభయదేవేరులతో కలిసి రాజమన్నార్ అలంకారంలో క‌ల్ప‌వృక్ష వాహనంపై క‌టాక్షించారు. ఈ వేడుకలో భక్తులు భారీగా పాల్గొన్నారు. కాగా మరికాసేపట్లో ఏడు గంటలకు స‌ర్వ‌భూపాల వాహనంపై స్వామివారు భక్తులకు అభ‌య‌మివ్వనున్నారు.

తిరుమల బ్రహ్మోత్సవాలు.. కాసేపట్లో సర్వభూపాల వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్న స్వామివారు
Ttd
Anand T
|

Updated on: Sep 27, 2025 | 6:12 PM

Share

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన శ‌నివారం ఉదయం శ్రీమలయప్ప స్వామివారు ఉభయదేవేరులతో కలిసి రాజమన్నార్ అలంకారంలో క‌ల్ప‌వృక్ష వాహనంపై భక్తులకు క‌టాక్షించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు.

క‌ల్ప‌వృక్ష వాహ‌నం – ఐహిక ఫ‌ల ప్రాప్తి

క్షీరసాగరమథనంలో విలువైన వస్తువులెన్నో ఉద్భవించాయి. వాటిలో క‌ల్ప‌వృక్షం ఒకటి. ఈ చెట్టు నీడన చేరిన వారికి ఆకలిదప్పులుండవు. పూర్వజన్మస్మరణ కూడా కలుగుతుంది. ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి. అలాకాక క‌ల్ప‌వృక్షం కోరుకున్న‌ ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. అటువంటి క‌ల్ప‌వృక్ష‌ వాహనాన్ని అధిరోహించి నాలుగో రోజు ఉదయం శ్రీ‌వారు ద‌ర్శ‌న‌మిచ్చారు.వాహ‌న‌సేవ‌లో తిరుమ‌ల శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, తిరుమ‌ల శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, టీటీడీ ఛైర్మ‌న్ శ్రీ బీఆర్ నాయుడు, ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌, రాజ్యసభ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప‌లువురు బోర్డు స‌భ్యులు, సివిఎస్వో శ్రీ ముర‌ళికృష్ణ‌, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

అయితే మరికాసేపట్లో శనివారం  రా త్రి 7  నుంచి 9 గంటల వరకు స‌ర్వ‌భూపాల వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఏడు గంటలకు ప్రారంభమయ్యే  ఊరేగింపులో స్వామివారు భక్తులకు స‌ర్వ‌భూపాల వాహనంపై స్వామివారు దర్శనం ఇవ్వనున్నారు.

టీటీడీ బ్రహ్మోత్సవాల లైవ్‌ను ఇక్కడ చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

టీ తాగే అలవాటు మానుకోలేకపోతున్నారా..? ఇలా ట్రై చేయండి..!
టీ తాగే అలవాటు మానుకోలేకపోతున్నారా..? ఇలా ట్రై చేయండి..!
కొడుకు సినిమాల్లోకి ఎంట్రీ.. కూతురు ఏం చేస్తుందంటే.. సునీల్..
కొడుకు సినిమాల్లోకి ఎంట్రీ.. కూతురు ఏం చేస్తుందంటే.. సునీల్..
తక్కువ వడ్డీకి హోమ్‌ లోన్‌ ఇచ్చే టాప్‌ 5 బ్యాంక్స్‌ ఇవే!
తక్కువ వడ్డీకి హోమ్‌ లోన్‌ ఇచ్చే టాప్‌ 5 బ్యాంక్స్‌ ఇవే!
సరికొత్త డిజైన్‌తో మహీంద్రా XUV 7XO.. కేవలం రూ.21 వేలతోనే బుకింగ్
సరికొత్త డిజైన్‌తో మహీంద్రా XUV 7XO.. కేవలం రూ.21 వేలతోనే బుకింగ్
చిటికెలో ప్లేట్ ఖాళీ! బ్యాచిలర్స్ కి బెస్ట్ వెల్లుల్లి ఎగ్ రైస్
చిటికెలో ప్లేట్ ఖాళీ! బ్యాచిలర్స్ కి బెస్ట్ వెల్లుల్లి ఎగ్ రైస్
మటన్ చాప్స్‌తో ఇలా వండితే మీ ఇంట్లో పండగే!
మటన్ చాప్స్‌తో ఇలా వండితే మీ ఇంట్లో పండగే!
కళ్ళు మూసుకోడు.. నిద్రపోడు… 50 ఏళ్లుగా ఇదే జీవితం! డాక్టర్లే షాక్
కళ్ళు మూసుకోడు.. నిద్రపోడు… 50 ఏళ్లుగా ఇదే జీవితం! డాక్టర్లే షాక్
ఆ పాటకు యూట్యూబ్ నుంచి కోటి 80 లక్షలు వచ్చాయి.. సింగర్ రాము..
ఆ పాటకు యూట్యూబ్ నుంచి కోటి 80 లక్షలు వచ్చాయి.. సింగర్ రాము..
USA vs IND: అమెరికా టీం ప్లేయింగ్ 11లో అంతా మనోళ్లే
USA vs IND: అమెరికా టీం ప్లేయింగ్ 11లో అంతా మనోళ్లే
ఉదయం కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు వస్తున్నాయా? ఎందుకొస్తాయో తెలుసా
ఉదయం కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు వస్తున్నాయా? ఎందుకొస్తాయో తెలుసా