ఆ రోజు నుంచే అందుబాటులోకి తిరుమల పుష్కరిణి..
03 September 2024
Battula Prudvi
కలియుగ దైవం శ్రీ తిరుమల వెంకటేశ్వరస్వామివారి పుష్కరిణి నెల రోజుల తర్వాత మళ్లీ భక్తులకు అందుబాటులోకి వచ్చింది.
అక్టోబర్ 4 నుంచి 12 వ తేదీ వరకు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వేంకటాద్రిపై ఘనంగా నిర్వహించనున్నారు.
ఇందులో భాగంగా పుష్కరిణిని శుభ్రం చేయడం కోసం ఆగస్టు 1 నుంచి భక్తులను అనుమతించడం నిలిపివేసారు అధికారులు.
స్వామి వారి పుష్కరిణిలోని నీటిని తీసివేసి అడుగు భాగంలో ఉన్న ఇసుక, పాచిని పూర్తిగా శుభ్రం చేయించారు టిటిడి అధికారులు.
పుష్కరిణి అడుగు భాగంలో ఉన్న ఇసుక, పాచిని శుభ్రం చేయడాని సుమారు 100 మంది పారిశుధ్య కార్మికులు రాత్రి పగలు కష్టపడి పని చేశారు.
పుష్కరిణి మెట్లకు బంగారు రంగులు వేయడంతో మరింత అద్భుతంగా కనిపిస్తుంది. అనంతరం కోటి లీటర్ల నీటితో పుష్కరిణిని నింపారు.
ఆలయంలోని తిరుమల శ్రీవారి పుష్కరిణికి ప్రతి రోజు హారతి జరిగేది. మరమ్మతులు కారణంగా ఆగస్టు నెల మొత్తం హారతిని టీటీడీ నిలిపివేసింది.
సెప్టెంబర్ 1 నుంచి భక్తులను పుష్కరిణిలో స్నానం కోసం అనుమతించడంతో పాటు పుష్కరిణి హారతిని తిరిగి ప్రారంభించారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి