AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TTD Brahmotsavam: వైభవంగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. రెండో రోజు వాహన సేవలు

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ధ్వజారోహణం శాస్త్రోక్తంగా జరిగింది. బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ సాగిన ధ్వజారోహణంతో శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం పట్టు వస్త్రాలు సమర్పించారు. పెళ్లిరోజు రాత్రి పెద్ద శేష వాహనంపై మలయప్ప స్వామి దర్శనం ఇవ్వగా వాహన సేవలో సీఎంతో పాటు ఉపరాష్ట్రపతి దంపతులు పాల్గొన్నారు. 19 రాష్ట్రాల కళాబృందాల ప్రదర్శన భక్తులను ఆకట్టుకోగా తిరుమల ఇంకా వెలిగిపోతుంది..

TTD Brahmotsavam: వైభవంగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. రెండో రోజు వాహన సేవలు
TTD Brahmotsavam
Srilakshmi C
|

Updated on: Sep 25, 2025 | 11:58 AM

Share

తిరుపతి, సెప్టెంబర్ 25:  తిరుమల బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. బ్రహ్మోత్సవాల్లో మెదటి రోజు ధ్వజారోహణ ఘట్టంతో వైభవంగా ప్రారంభమైంది. శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాలలో తొలిరోజైన బుధవారం రాత్రి సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. టీటీడీ చైర్మన్, ఈవో లు సీఎం చంద్రబాబుకు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో తొలి వాహన సేవ అందుకున్న మలయప్ప స్వామి పరమపద వైకుంఠనాథుడు అలంకారంలో దర్శనమిచ్చారు.

మరోవైపు ఎగ్జిబిషన్ ను తొలి రోజు టీటీడీ చైర్మన్ ప్రారంభించారు. తిరుమలలో కల్యాణ వేదిక వద్ద ఏర్పాటు చేసిన ఫల, పుష్ప, ఫోటో ప్రదర్శనతో పాటు మీడియా సెంటర్‌ ను కూడా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ప్రారంభించారు. బ్రహ్మోత్సవాల వైభవాన్ని ఫల, పుష్ప, ఫోటో ప్రదర్శన ప్రతిబింబిస్తోందన్నారు. తిరుమలలో మీడియా అందిస్తున్న సేవలను అభినందించిన చైర్మన్ శ్రీ వేంకటేశ్వర స్వామి వైభవాన్ని స్ఫూర్తిదాయకంగా ప్రచారం చేస్తున్నారని ప్రశంసించారు. ప్రతికూల అంశాలు ఉంటే వాటిని తన దృష్టికి తీసుకురావాలని, వాటికి పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తామన్నారు. వాటిని సంచలనాత్మకంగా చూపించడం మానుకోవాలని మీడియాకు సూచించారు. స్వామి అనుగ్రహంతో భక్తులందరూ వార్షిక బ్రహ్మోత్సవాలను ఆనందంగా తిలకించాలని ఆకాంక్షించారు.

ఇక శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు చిన్న శేష వాహనంపై మలయప్ప స్వామి దర్శనం ఇవ్వనున్నారు. 5 పడగల ఆదిశేషుని వాహనంగా చేసుకుని మాడవీధుల్లో ఊరేగుతున్న మలయప్ప స్వామి. చిన్ని కృష్ణుడి అవతారంలో భక్తులకు దర్శనం. గ్యాలరీలోని భక్తులకు దర్శనం ఇస్తున్న స్వామి వారు. తిరుమల తిరుపతి శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు వాహన సేవలు ఉదయం 8 గంటలకే ప్రారంభమైనాయి. చిన్న శేష వాహనంలో శ్రీవారు దర్శనమిచ్చారు. ఇక రాత్రి 7 గంటలకు హంస వాహనం జరగనుంది.

తిరుమలలో సీఎం చంద్ర బాబు రెండో రోజు పర్యటన కొనసాగుతుంది. అక్కడ ఉప రాష్ట్రపతి తో కలిసి వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అనంతరం తిరుమల నుంచి తిరుపతి చేరుకొని అమరావతికి తిరుగు ప్రయాణం చేయనున్నట్లు సమాచారం.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..