AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పైన చూస్తే రాతి బండ.. తీరా చూస్తే బయటపడ్డ వెయ్యేళ్ల నాటి శాసనం.. ఎక్కడంటే?

దక్షిణ భారతదేశంలో చోళులకు ప్రత్యేక స్థానం ఉంది. పొత్తపి చోళులు ఆంధ్రప్రదేశ్‌లో తమ అధిపత్యాన్ని ప్రదర్శించారని చరిత్ర చెబుతోంది. ముఖ్యంగా చిత్తూరు, కడప, నెల్లూరు ప్రాంతాల్లో చోళుల చరిత్రలో కీలక ఘట్టంగా ఉందని గతంలో పలు శాసనాలు నిరూపించాయి. అయితే తాజాగా వెయ్యేళ్లనాటి చోళుల కాలంలో ఉన్న అరుదైన చారిత్రక శిలాశాసనం తాజాగా బయటపడింది.

పైన చూస్తే రాతి బండ.. తీరా చూస్తే బయటపడ్డ వెయ్యేళ్ల నాటి శాసనం.. ఎక్కడంటే?
Thousand Years Old Inscript
Ch Murali
| Edited By: |

Updated on: Sep 25, 2025 | 3:06 PM

Share

దక్షిణ భారతదేశంలో చోళులకు ప్రత్యేక స్థానం ఉంది. పొత్తపి చోళులు ఆంధ్రప్రదేశ్‌లో తమ అధిపత్యాన్ని ప్రదర్శించారని చరిత్ర చెబుతోంది. ముఖ్యంగా చిత్తూరు, కడప, నెల్లూరు ప్రాంతాల్లో చోళుల చరిత్రలో కీలక ఘట్టంగా ఉందని గతంలో పలు శాసనాలు నిరూపించాయి. అయితే తాజాగా వెయ్యేళ్లనాటి చోళుల కాలంలో ఉన్న అరుదైన చారిత్రక శిలాశాసనం తాజాగా బయటపడింది. 12వ శతాబ్దానికి చెందిన పొత్తపి చోళుల రాసిన శిలాశాసనం గుర్తించారు. నెల్లూరు జిల్లాకు చెందిన చరిత్రకారుడు రసూల్.. ఇదే విషయాన్ని పురావస్తు శాఖ అధికారులకు తెలపడంతో వారంతా ఓ బృందంగా ఈ ప్రాంతంలో పర్యటించారు. ఈ శిలాశాసనం పూర్తి వివరాలు ఆరా తీశారు. కేంద్ర పురావస్తు శాఖ గుర్తించిన ఈ శాసనంలో అసలేముంది..!

దక్షిణ భారతదేశ చరిత్రలో చోళుల వంశం ప్రత్యేక స్థానం సంపాదించింది. పొత్తపి చోళులుగా పిలువబడే చోళులు ఆంధ్రప్రదేశ్లో తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. ముఖ్యంగా రాయలసీమలో దట్టమైన అటవీ ప్రాంతంలో వీరు పాలించినప్పటి శాసనాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. తాజాగా నెల్లూరు జిల్లాలో సైతం వెయ్యేళ్ళనాటి అరుదైన శాసనం ఒకటి బయటపడింది. ఈ శాసనం పరిశీలించిన పురావస్తు శాఖ అధికారులు అరుదైన శాసనంగా గుర్తించారు. ఇలాంటి శాసనాలు ఎంతో అరుదుగా లభిస్తాయని ఈ శాసనాల ద్వారా వెయ్యేళ్ళ క్రితం నాటి చరిత్ర తెలుసుకునే అవకాశం ఇప్పటి తరానికి ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

నెల్లూరు జిల్లా మునగాల వెంకటాపురం అటవీ ప్రాంతంలోని శిథిలావస్థకు చేరిన శివాలయం వద్ద ఈ శాసనం గుర్తించారు. నాలుగు అడుగుల పొడవు రెండు అడుగుల వెడల్పు కలిగిన గ్రానైట్ రాతిపై ఈ శాసనం చెక్కి ఉంది. చుట్టూ అటవీ ప్రాంతం ఎటు చూసినా కొండలు గుట్టలు కలిగిన ఈ గ్రామంలో ఈ శాసనం లభించడంతో ఈ ప్రాంతంలో చోళులు చరిత్ర ఉందని తెలుస్తోంది. వెయ్యేళ్ళ క్రితం నాటిది గుర్తించిన ఈ శాసనం, అప్పటి ప్రజలు పలు సౌకర్యాలతో వర్ధిల్లినట్లు చెబుతోంది. ఈ శాసనం చాలా విలువ అయ్యిందని వీటిని సరైన రీతిలో సంరక్షిస్తే, భవిష్యత్తు తరాలకు అందుబాటులో ఉంటుందని అంటున్నారు పురావస్తు శాఖ శాస్త్ర వేత్తలు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..