Nandamuri Balakrishna: అసెంబ్లీలో బాలయ్యకు కోపం వచ్చింది.. ఎందుకో తెల్సా..?
చిరంజీవి గట్టిగా అడిగితేనే సినిమావాళ్లను జగన్ కలిశారనడం అబద్దం అన్నారు ఎమ్మెల్యే బాలకృష్ణ. దాన్ని తాను అంగీకరించనన్నారు. అవమానించడం వరకు నిజమన్నారు. అంతేకాదు ఇటీవల FDC మీటింగ్ సమయంలో కూడా తనను అమావనించారని ఆగ్రహం వ్యక్తం చేశారు బాలకృష్ణ. .. ..
బాలయ్యకు కోపం వచ్చింది. అది కూడా అసెంబ్లీలో. ఎందుకో తెల్సా.. కైకలూరు బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు.. గతంలో జగన్ సీఎంగా ఉన్న సమయంలో.. సినిమా సెలబ్రిటీలు ఆయన ఇంటికి వెళ్లిన సమయంలో అవమానించిన విషయాన్ని ప్రస్తావించారు. ఆ సమయంలో జగన్ సినిమా సెలబ్రిటీలను కలిసేందుకు ఇష్టపడలేదని.. సినిమాటోగ్రఫీ మంత్రితో మాట్లాడమని చెప్పినట్లు చెప్పుకొచ్చారు. అప్పుడు చిరంజీవి కలగజేసుకుని.. గట్టిగా మాట్లాడటంతో జగన్ వచ్చి సినిమావాళ్లను కలిసినట్లు చెప్పారు. ఈ విషయంపై అభ్యంతరం వ్యక్తం చేశారు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. ఆయన గట్టిగా అడిగితే.. ఈయన వచ్చారా..? అంత సీన్ లేదన్నట్లు మాట్లాడారు బాలయ్య.
అంతేకాదు ఇటీవల ఈ ప్రభుత్వంలో కూడా ఫిల్మ్ డెవలప్‌మెండ్ కార్పోరేషన్ మీటింగ్ నిమిత్తం చర్చకు ఇండస్ట్రీ వాళ్లను ఆహ్వానించినప్పుడు.. తన పేరును 9 స్థానంలో పెట్టి అవమానించినట్లు బాలయ్య చెప్పారు. ఆ విషయాన్ని వెంటనే సినిమాటోగ్రఫి మంత్రి కందుల దుర్గేష్‌కు చేసి వివరించినట్లు వెల్లడించారు.
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!

