అక్టోబర్ 3వ తేదీ అంటే గురువారం రాత్రి 7 నుంచి 8 గంటల వరకు అంకురార్పణ, విశ్వక్సేన ఆరాధనతో బ్రహ్మోత్సవా వేడుకులు మొదలుకానున్నాయి.
అక్టోబర్ 4వ తేదీ అంటే మొదటిరోజున మధ్యాహ్నం 3:30 - 5:30 గంటల వరకు బంగారు తిరుచ్చి ఉత్సవం, సాయంత్రం 6 గంటలకు ద్వజారోహణం, రాత్రి 9:00 - 11:00 గంటల వరకు పెద్ద శేష వాహనం జరగనున్నాయి.
రెండోరోజు అక్టోబర్ 5వ తేదీ ఉదయం 8:00 - 10:00 వరకు చిన శేష వాహనం, మధ్యాహ్నం 1:00- 3:00 వరకు స్నపన తిరుమంజనం(ఉత్సవర్లకు అభిషేకం), రాత్రి 7:00 - 9:00 వరకు హంస వాహనం.
మూడోరోజు అక్టోబర్ 6వ తేదీ విసయానికి వస్తే ఉదయం 8:00 - 10:00 వరకు సింహవాహనం, మధ్యాహ్నం 1:00- 3:00 వరకు స్నపన తిరుమంజనం, రాత్రి 7:00 - 9:00 వరకు ముత్యాల పల్లకీ వాహనం (ముత్యపు పందిరి వాహనం).
అక్టోబర్ 7వ తేదీ అంటే నాల్గవ రోజున ఉదయం 8:00 - 10:00 వరకు కల్పవృక్ష వాహనం, రాత్రి 7:00 - 9:00 వరకు సర్వభూపాల వాహనం ఊరేగింపు జరగనున్నాయి.
అక్టోబర్ 8న ఉదయం 8:00 - 10:00 వరకు మోహినీ అవతారం, రాత్రి 7:00 - 12:00 వరకు గరుడ వాహన సేవలతో ఐదో వేడుక పూర్తికానుంది.
ఆరో రోజైన అక్టోబర్ 9న ఉదయం 8:00 - 10:00 వరకు హనుమంత వాహనం, సాయంత్రం 4:00 - 5:00 వరకు స్వర్ణ రథోత్సవం (స్వర్ణ రథం), రాత్రి 7:00 - 9:00 వరకు గజవాహనం.
అక్టోబర్ 10 ఏడో రోజు నాడు ఉదయం 8:00 - 10:00 వరకు సూర్య ప్రభ వాహనం, మధ్యాహ్నం 1:00- 3:00 వరకు స్నపన తిరుమంజనం, రాత్రి 7:00 - 9:00 వరకు చంద్రప్రభ వాహనం
ఎనిమిదో రోజైన అక్టోబర్ 11న ఉదయం 6 గంటలకు రథోత్సవం (రథం, రథోత్సవం), రాత్రి 7:00 - 9:00 వరకు, అశ్వవాహనంతో వేడుకలు పూర్తవుతాయి.
అక్టోబర్ 12న తొమ్మిదో రోజున తెల్లవారుజామున 3:00 - 6:00 వరకు పల్లకీ ఉత్సవం & తిరుచ్చి ఉత్సవం, ఉదయం 6:00 - 9:00 వరకు స్నపన తిరుమంజనం, చక్రస్నానంతో శ్రీవారి బ్రహ్మోత్సవా వేడుకలు ముగియనున్నాయి.