అక్టోబర్లో 9 రోజుల పాటు తిరుమల శ్రీవారి ఆలయంలో బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవలను టీటీడీ రద్దుచేసింది.
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక, బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవలను రద్దు చేశారు.
అక్టోబర్ మూడో తేదీ నుంచి 12వ తేదీ వరకూ ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలను రద్దు చేసినట్లు టీటీడీ తెలిపింది.
ఆలయంలో అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు జరగనున్న సాలకట్ల బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 3 సాయంత్రం నిర్వహించే అంకురార్పణ కార్యక్రమంతో ప్రారంభమవుతాయి.
ప్రతిరోజూ ఉదయం 8 నుంచి 10 గంటల వరకు.. అలాగే సాయంత్రం 7 నుంచి 9 వరకూ వాహన సేవలు నిర్వహిస్తారు పండితులు.
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భక్తజనం అధిక సంఖ్యలో వస్తారు. సౌకర్యంగా దర్శనం కల్పించేందుకు బ్రేక్, వివిధ ప్రత్యేక దర్శనాలను రద్దు చేసింది.
అక్టోబర్ 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు వయోవృద్దులు, దివ్యాంగులు, ఏడాదిలోపు చిన్న పిల్లల తల్లిదండ్రులకు కల్పించే ప్రత్యేక దర్శనాలు కూడా టిటిడి రద్దు అయ్యాయి.
అలాగే వీఐపీ బ్రేక్ దర్శనాలను ప్రోటోకాల్ ప్రముఖులకు పరిమితం చేశారు. ఈ విషయాలను భక్తులు గమనించాలని టీటీడీ కోరింది.