- Telugu News Photo Gallery Spiritual photos Srivari brahmotsavam 2024: Aswa vahana seva held in tirumala tirupati
Tirumala: కలి దోషాలను తొలగించే కల్కి వాహన దర్శనం.. కల్కి అలంకారంలో మలయప్ప
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అశేష భక్త వాహిని మధ్య అంగరంగ వైభవంగా సాగుతున్నాయి . బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన శుక్రవారం రాత్రి మలయప్పస్వామి అశ్వ వాహనంపై కల్కి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
Updated on: Oct 12, 2024 | 7:20 AM

కల్కి వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్లు వేదమంత్రాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా శ్రీవారికి కర్పూరహారతులు సమర్పించి.. స్వామివారిని దర్శించుకున్నారు.

కృష్ణయజుర్వేదం ప్రకారం పరమాత్మ అశ్వ స్వరూపంగా తెలుస్తోంది. అంతేకాదు ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి.

అందువల్ల అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియమించే నియామకుడు.

కనుక శ్రీనివాసుడు అశ్వవాహనాదిరూఢుడై కల్కి స్వరూపాన్ని ప్రకటిస్తూ కలిదోషాలకు దూరంగా ఉండాలని, నామ సంకీర్తనాదులను ఆశ్రయించి తరించాలని యావత్ ప్రపంచానికి ప్రబోధిస్తున్నాడు.

సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం అశ్వ వాహన సేవలో టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టు ఆధ్వర్యంలో వివిధ రాష్ట్రాల నుండి 20 కళా బృందాలు, 528 మంది కళాకారులు పాల్గొన్నారు.

తిరుపతి శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్య కళాశాలకు చెందిన విద్యార్థులచే భరతనాట్యం, కూచిపూడి నృత్యాలు, తెలంగాణ రాష్ట్రానికి చెందిన వెంకట కృష్ణ బృందం ప్రదర్శించిన జానపద నృత్యం అలరించింది .

శ్రీకాకుళానికి చెందిన వి.మనీష బృందం ప్రదర్శించిన పంజాబ్ బంగ్రా నృత్యం, తిరుపతికి చెందిన కార్తిక్ నాయక్ బృందం ప్రదర్శించిన భరతనాట్యం విశేషంగా ఆకర్షించింది.

మదనపల్లికి చెందిన ఎల్. వెంకట రమణ బృందం ప్రదర్శించిన పిల్లనగ్రోవి నృత్యం, తమిళనాడుకు చెందిన తల్కావతి బృందం ప్రదర్శించిన భరతనాట్యం, రాజస్థానుకు చెందిన మయాంక్ తివారీ బృందం ప్రదర్శించిన దాండియా నృత్యం కనువిందు చేసింది .

, రాజస్థానుకు చెందిన రూప్ సింగ్ బృందం ప్రదర్శించిన మట్కి కళా విశేషం, మంత్రాలయంకు చెందిన వాజిరాజ్ బృందం ప్రదర్శించిన భజన సంకీర్తన, రాజమండ్రికి చెందిన రోహిణి కుమార్ బృందం ప్రదర్శించిన డప్పు విన్యాసాలు ఆకట్టుకున్నాయి.

పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఎ.లక్ష్మీ బృందం ప్రదర్శించిన కోలాటం, రాయచోటికి చెందిన వై.మల్లిఖార్జున బృందం కళాప్రదర్శన భక్తులను పరవశింపజేసింది .

తిరుపతికి చెందిన ప్రసన్న కుమారి బృందం, తిరుమలకు చెందిన డి. శ్రీనివాసులు బృందం, కావలికి చెందిన పి.అలేక్య బృందాలు ప్రదర్శించిన కోలాటాలు తిరుపతికి చెందిన డాక్టర్ మురళీ కృష్ణ బృందం ప్రదర్శించిన దశావతారాలు రూపకం భక్తులును పరవసింపచేశాయి.

ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ఈవో జె. శ్యామలరావు ఆదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జెఈవోలు గౌతమి, వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీధర్ ఇతర అధికారులు పాల్గొన్నారు





























