నవరాత్రి వేడుకల స్పెషల్‌.. సైకిల్ పై చేతులు వదిలేసి డ్యాన్స్.. తలపై కలశం కూడా.. చూసేందుకు రెండు కళ్లు చాలవంతే

Basha Shek

Basha Shek |

Updated on: Oct 01, 2022 | 12:16 PM

ఈ వైరల్ వీడియోలో, అమ్మాయి తన రెండు చేతులను వదిలి ఎంతో ఉత్సాహంగా సైకిల్ నడుపుతోంది. అంతేకాదు తలపై ఒక కలశం కూడా పెట్టుకుని ఎంతో బ్యాలెన్సెడ్‌గా క్లాసికల్‌ డ్యాన్స్ కూడా చేస్తుంది.

నవరాత్రి వేడుకల స్పెషల్‌.. సైకిల్ పై చేతులు వదిలేసి డ్యాన్స్.. తలపై కలశం కూడా.. చూసేందుకు రెండు కళ్లు చాలవంతే
Girl Dance

మన దేశంలో ప్రతిభకు ఎలాంటి కొదవలేదు. కొందరికి సింగింగ్ ట్యాలెంట్‌ ఉంటే.. మరి కొందరు సూపర్బ్‌గా డ్యాన్స్ చేస్తారు. ఇంకొందరు పెయింటింగ్, ఆర్ట్‌లో తమ ప్రతిభను చాటుకుంటున్నారు. వీరికి కాసింత ప్రోత్సాహం అందిస్తే తమ ప్రతిభా నైపుణ్యాలతో ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యపరుస్తారు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఒక అమ్మాయి తన అద్భుతమైన ప్రతిభతో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మనలో చాలామంది బాల్యంలో సైకిల్ తొక్కి ఉంటాం. ఇప్పటికీ కొందరు సైకిల్‌ పైనే వెళతారనుకోండి. అయితే మీరు ఎప్పుడైనా రెండు చేతులను వదిలి సైకిల్ తొక్కారా? ఇది చాలా కష్టం.. ఎందుకంటే బ్యాలెన్స్‌ తప్పిపోయి కింద పడిపోతామేమోనన్న భయం. కానీ ఈ వైరల్ వీడియోలో, అమ్మాయి తన రెండు చేతులను వదిలి ఎంతో ఉత్సాహంగా సైకిల్ నడుపుతోంది. అంతేకాదు తలపై ఒక కలశం కూడా పెట్టుకుని ఎంతో బ్యాలెన్సెడ్‌గా క్లాసికల్‌ డ్యాన్స్ కూడా చేస్తుంది.

@santoshsaagr అనే ఐడీతో సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇప్పటివరకు వేలాది మంది ఈ వీడియోను చూశారు. వందలాది మంది లైకులు కొట్టారు. ‘ఇది నిజంగా అద్భుతం. ఇన్‌క్రెడిబుల్ ఇండియా’, ‘ వావ్‌.. ఈ అమ్మాయి భలే బ్యాలెన్స్‌ చేస్తోంది’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా ఈ అమ్మాయి ఇలా సైకిల్‌పై చేతులు వదిలేసి డ్యాన్స్ చేయడం ఇదేమి మొదటిసారి కాదు. గతంలోనూ పలు సందర్భాల్లోనూ ఇలాగే డ్యాన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.

జాతీయ జెండా పట్టి..

75వ స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా ఈ ఏడాది ఆగస్టులో కూడా ఇలాంటి అరుదైన ఫీట్‌ చేసింది. హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీలో భాగంగా సైకిల్‌పై చేతులు వదిలేసి.. జాతీయ జెండాను పట్టుకుని డ్యాన్స్‌ చేసింది. ఈ వీడియో కూడా అప్పట్లో బాగా వైరలైంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా ఇలా సంప్రదాయంగా ముస్తాబై తలపై కలశంతో సైకిల్‌ పై చేతులు వదిలేసి డ్యాన్స్‌ చేసింది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu