రోడ్డుపై భారీ కొండచిలువ.. భయం లేకుండా ఎదురెళ్లిన వ్యక్తి.. చివరికి ఏం జరిగిందంటే.!

జంతువు పెద్దదైనా, చిన్నదైనా.. కొండచిలువకు భయపడాల్సిందే. ఏ జంతువు దొరికినా కొండచిలువ అమాంతం మింగేస్తుంది.

రోడ్డుపై భారీ కొండచిలువ.. భయం లేకుండా ఎదురెళ్లిన వ్యక్తి.. చివరికి ఏం జరిగిందంటే.!
Python On Road
Follow us

|

Updated on: Oct 01, 2022 | 1:16 PM

ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన జీవుల్లో పాములు కూడా ఒకటి. పాముల్లో 2 వేలకు పైగా జాతులు ఉన్నాయి. ఇక ఈ సరీసృపాలలో అత్యంత భయంకరమైనది కొండచిలువ. జంతువు పెద్దదైనా, చిన్నదైనా.. కొండచిలువకు భయపడాల్సిందే. ఏ జంతువు దొరికినా కొండచిలువ అమాంతం మింగేస్తుంది. అలాంటి కొండచిలువ దారికి అడ్డంగా ఉందని.. ఓ వ్యక్తి తన ఒట్టి చేతులతో పట్టుకుని పక్కన పడేశాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

ఈ వైరల్ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ ప్రవీణ్ కస్వాన్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఇందులో అర్ధరాత్రి వేళ ఓ భారీ కొండచిలువ రోడ్డు దాటుతుండటం మీరు చూడవచ్చు. ఇక అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి తన వాహనాన్ని నిలిపేసి.. సరాసరి కొండచిలువ దగ్గరకు వెళ్లి.. దాని తోక పట్టుకుని.. ఏమాత్రం భయం లేకుండా త్రాడు పట్టుకున్నట్లు పొదల్లోకి లాగి పడేస్తారు. దానికి సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.

కాగా, 17 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో వేలల్లో వ్యూస్ వచ్చిపడుతున్నాయి. దీనిపై నెటిజన్లు వివిధ రకాల ఫన్నీ కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. లేట్ ఎందుకు మీరూ ఓ లుక్కేయండి.