Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఊసరవెల్లి రంగులు మార్చడం చూసే ఉంటారు.. కానీ డ్యాన్స్ మూమెంట్స్ చేయడం ఎప్పుడైనా చూశారా..

ప్రస్తుతం ట్రెండ్ అంతా సోషల్ మీడియాదే. చేతిలో ఎప్పుడైతే సెల్ ఫోన్, దాని నిండా డేటా అందుబాటులోకి వచ్చిందో గానీ.. ప్రపంచమే ఓ కుగ్రామంగా మారిపోయింది. అర చేతిలో సమస్తం వచ్చేశాయి. సోషల్ మీడియా,..

ఊసరవెల్లి రంగులు మార్చడం చూసే ఉంటారు.. కానీ డ్యాన్స్ మూమెంట్స్ చేయడం ఎప్పుడైనా చూశారా..
Chameleon
Follow us
Ganesh Mudavath

|

Updated on: Oct 01, 2022 | 1:54 PM

ప్రస్తుతం ట్రెండ్ అంతా సోషల్ మీడియాదే. చేతిలో ఎప్పుడైతే సెల్ ఫోన్, దాని నిండా డేటా అందుబాటులోకి వచ్చిందో గానీ.. ప్రపంచమే ఓ కుగ్రామంగా మారిపోయింది. అర చేతిలో సమస్తం వచ్చేశాయి. సోషల్ మీడియా, ఇంటర్నెట్ ద్వారా ఎన్నో రకాల పనులు చక్కదిద్దుకుంటున్నారు. అంతే కాదండోయ్ ఎంటర్టైన్మెంట్ కూ కొదవ లేదు. రోజూ కొన్ని వేల వీడియోలు పోస్ట్ అవుతున్నాయి. వాటిలో అందరినీ ఆకర్షించేవి వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని చాలా ఫన్నీగా ఉంటాయి. మరికొన్ని ఆశ్చర్యంగా అనిపిస్తాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు చూసేందుకు ఎక్కువ మంది నెటిజన్లు ఆసక్తి చూపిస్తుంటారు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియో ఊసరవెల్లికి సంబంధించినది. రంగులు మార్చడంలో ఊసరవెల్లులను ఉదాహరణగా చెబుతుంటారు. అంతే కాకుండా అవి పరిస్థితులకు అనుగుణంగా కలర్స్ చేంజ్ చేస్తూ ఆశ్చర్యపరుస్తుంటాయి. కొన్నిసార్లు ఆకుపచ్చగా, మరికొన్నిసార్లు ఎరుపు-పసుపు రంగులోకి మారుతాయి. అయితే ఈ వీడియోలో ఊసరవెల్లి రంగు మారకుండా వింత పనులు చేస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది.

ఈ వీడియోలో ఓ ఊసరవెల్లి నిటారుగా ఉన్న పలుచని చెక్కపై నిలబడి పై ముందరి కాళ్లతో వింత కదలికలు చేయడాన్ని చూడవచ్చు. డ్యాన్స్ మూడ్‌లో ఉన్నట్లు అనిపిస్తుంది. ఊసరవెల్లి ఇలాంటి వింత పనులు చేయడం మీరెప్పుడూ చూసి ఉండరు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఊసరవెల్లి రంగు మారడం మీరు తప్పక చూసే ఉంటారు. కానీ ఇలా చేతులు ఊపి డ్యాన్స్ మూమెంట్స్ చేయడం మీరు ఎప్పుడూ చూసి ఉండరు. ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. 35 సెకన్ల నిడివి గల ఈ వీడియోకు ఇప్పటి వరకు 8 లక్షలకు పైగా వ్యూస్, 51 వేలకు పైగా లైక్స్ వచ్చాయి. అంతే కాకుండా నెటిజన్లు తమకు నచ్చిన విధంగా ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..