Madhya Pradesh: నువ్వు సూపర్‌ భయ్యా.. గాయపడిన పాముకు నీళ్లు తాపి సపర్యలు..

పాము లాంటి ప్రమాదకరమైన జంతువులకు ఇటీవల కొందరు ఆహారం తినిపించడాలు, నీళ్లు తాగించడాలు మనం చూస్తూనే ఉన్నాం. వాటి వీడియోలు కూడా సోషల్‌ మీడియాలో బాగా వైరలయ్యాయి.

Madhya Pradesh: నువ్వు సూపర్‌ భయ్యా.. గాయపడిన పాముకు నీళ్లు తాపి సపర్యలు..
Snake
Follow us
Basha Shek

|

Updated on: Oct 01, 2022 | 8:52 AM

పాము చిన్నదైనా, పెద్దదైనా దూరంగా ఉండాల్సిందే. ఎందుకంటే అది కాటేస్తే ప్రాణానికే ప్రమాదం. ముఖ్యంగా నాగుపాములకు దూరంగా ఉండాల్సిందే. వాటి విషం క్షణాల్లో మనుషుల ప్రాణాలను బలిగొంటుంది. అందుకే మనిషైనా, పెద్ద జంతువులైనా పాములకు దూరంగా ఉంటాయి. అయితే అలాంటి ప్రమాదకరమైన జంతువులకు ఇటీవల కొందరు ఆహారం తినిపించడాలు, నీళ్లు తాగించడాలు మనం చూస్తూనే ఉన్నాం. వాటి వీడియోలు కూడా సోషల్‌ మీడియాలో బాగా వైరలయ్యాయి. ఇప్పుడు అలాంటి వీడియోనే ఒకటి నెట్టింట్లో బాగా చక్కర్లు కొడుతోంది. ఇందులో ఒక వ్యక్తి ఎంతో తెగువను ప్రదర్శించాడు. గాయపడిన పాముకి ఓపికగా నీళ్లు పట్టి మూగజీవాల పట్ల తన మానవత్వాన్ని చాటుకున్నాడు.

మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాలో ఈఘటన చోటుచేసుకుంది. నార్వర్ నగర్‌లోని ఓ ఆలయంలో చిన్నారులకు ఆలయ ప్రాంగణంలో చెట్టుపై పాము కనిపించింది. ఆ తర్వాత తమ బంధువులకు సమాచారం అందించారు. కాగా నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నందున ఆలయం భక్తులతో రద్దీగా ఉంది. దీంతో పామును చూసేందుకు జనాలు ఎగబడ్డారు. పాముకు ఏమైనా హాని తలపెడతారేమోనని అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ బృందం, స్నేక్‌సేవర్‌లు పామును రక్షించారు. కాగా అటవీ శాఖ బృందం మొదట పామును చెట్టు నుండి కిందకు దింపారు. ఆ తరువాత అటవీ శాఖ బృందం వెంట వచ్చిన స్నేక్ సేవర్ గాయపడిన పాముకి నీరు అందించాడు. దీంతో అక్కడ ఉన్న ప్రజలు ఆశ్చర్యపోయారు. అదే సమయంలో పాముపై గాయాల గుర్తులు ఉండడంతో లేపనం పూశాడు. అనంతరం పామును సురక్షిత అడవుల్లో వదిలిపెట్టారు.

ఇవి కూడా చదవండి

పాము వీడియోను ఇక్కడ చూడొచ్చు..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..