పిల్లి సంతోషం మామూలుగా లేదుగా.. ఫుడ్ ను చూసిన వెంటనే ఆనందంతో గెంతులు.. క్యూట్ వీడియో
ఇంట్లో పెంపుడు జంతువులు ఉంటే ఆ సందడే వేరు. కుటుంబసభ్యుల్లా కలిసిపోయి అవి చేసే అల్లరి, హంగామా అంతా ఇంతా కాదు. కలిసి తినడం, కలిసి నిద్రపోవడం, చిన్న చిన్న పనులు చేయడం వంటి చర్యలతో అందరినీ..
ఇంట్లో పెంపుడు జంతువులు ఉంటే ఆ సందడే వేరు. కుటుంబసభ్యుల్లా కలిసిపోయి అవి చేసే అల్లరి, హంగామా అంతా ఇంతా కాదు. కలిసి తినడం, కలిసి నిద్రపోవడం, చిన్న చిన్న పనులు చేయడం వంటి చర్యలతో అందరినీ ఆకట్టుకుంటాయి. అయితే సోషల్ మీడియా వినియోగం అధికమయ్యాక ఇవి చేసే అల్లరి అందరికీ తెలుస్తోంది. వీటిని పెంచుకునే యజమానులు ఇవి చేసే పనులను వీడియో తీసి ఇంటర్నెట్ లో పోస్ట్ చేస్తున్నారు. దీంతో అవి క్షణాల్లో వైరల్ గా మారుతున్నాయి. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో చాలానే ఉన్నాయి. వీటిని చూసేందుకు నెటిజన్లు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. పిల్లులకు సంబంధించిన ఏదైనా ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. వీటిలో కొన్ని చాలా ఫన్నీగా ఉంటాయి. కొన్ని వీడియోల్లో పిల్లి తమ అందమైన చర్యలతో హృదయాలను గెలుచుకుంటుంది. ప్రస్తుతం ఇంటర్నెట్‌లో పిల్లికి సంబంధించిన ఇలాంటి వీడియో చాలా వేగంగా వైరల్ అవుతోంది. పిల్లి తన ఆహారాన్ని చూసి చాలా సంతోషించి ఆనందంతో గంతులేయడం ప్రారంభిస్తుంది.
ఇవి కూడా చదవండిView this post on Instagram
పిల్లికి ఫుడ్ పెడుతున్న సమయంలో ఆ ఇంటి యజమాని సౌండ్ చేస్తాడు. అది విన్న పిల్లి వెంటనే వేగంగా పరిగెత్తడాన్ని వీడియోలో చూడవచ్చు. సంతోషం పట్టలేక ఆనందంతో చెంగు చెంగున ఎగురుతూ డ్యాన్స్ చేస్తుంది. చివరలో బేబీ క్యాట్ బౌల్ లో ఉన్న ఫుడ్ ను తినే విధానం చూస్తే నవ్వు ఆగడం లేదు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో మియావ్డ్ అనే ఖాతా ద్వారా షేర్ చేశారు. ఈ వీడియోకు ఇప్పటివరకు మిలియన్ల కొద్దీ వ్యూస్, లైక్స్ వచ్చాయి. అంతే కాకుండా పిల్లి ఎక్స్ ప్రెషన్స్ చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. మనుషులైనా, జంతువులైనా వారి చర్యలు ఒకేలా ఉంటాయని కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి